English | Telugu

సూర్య స్థానంలో "3ఇడియట్స్"లో విజయ్

ఈ మధ్య సినిమాల్లో ఒక హీరో స్థానంలో మరో హీరో ప్రవేశించటం మన చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్య చాలా కామన్ ఫ్యాక్టర్ అయ్యింది.ఈ జాడ్యం ఇప్పుడు తమిళ సినీ రంగానికి కూడా అంటుకుంది.శంకర్ దర్శకత్వంలో జెమిని ఫిలిం సర్ క్యూట్స్ వారు నిర్మిస్తున్న "3ఇడియట్స్" చిత్రంలో ముందుగా ప్రిన్స్ మహేష్ బాబు అనుకున్నారు.ఆ స్థానంలో సూర్య వచ్చాడు. ప్రస్తుతం సుర్యకు దర్శకుడు శంకర్ కూ కలిగిన అభిప్రాయ భేదాల వల్ల ఇప్పుడు సూర్య స్థానంలోకి తమిళ యువ సూపర్ స్టార్ విజయ్ వచ్చాడని సమాచారం.అంటే విజయ్, జీవా, శ్రీరామ్ ఈ చిత్రంలో "3ఇడియట్స్"గా నటిస్తూండగా, హీరోయిన్ గా ఇలియానా, ప్రొఫెసర్ గా ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు.ఈ చిత్రం ఊటీ షెడ్యూల్‍ తర్వాత విజయ్ ఈ చిత్రం షుటింగ్ లో పాల్గొంటాడని తెలిసింది.