Read more!

English | Telugu

ఓ మై గాడ్ !!! అంతా సీక్రెట్ !

 

పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా రాజకీయంగా చాలా బిజీగా మారడంతో ఆయన షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. జూన్ 2 నుంచి ఆయన సినిమా విధులు చేపట్టనున్నారు. జూన్ 2 నుంచి ఆయన ‘ఓ మై గాడ్’ సినిమా పనుల్లో బిజీ కానున్నారు. వెంకటేశ్, పవన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కలియుగ కృష్ణుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం  హైదరాబాద్‌లో  ఒక సెట్‌ వేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత సురేష్‌బాబు పవన్ వెసుకోబోయే కాస్ట్యుమ్స్ గురించి ఒక ఫోటో షూట్ నిర్వహించారని సీక్రెట్ సమాచారం. ఈ షూట్‌ని అత్యంత రహస్యంగా చిత్రీకరించడమే కాకుండా, ఆ కెమెరా చిప్స్‌ను వెంటనే సురేష్ బాబు ఆఫీసుకు తీసుకువెళ్లారట. ఈ షూట్ నుంచి బెస్ట్ షాట్స్‌ని సురేష్, వెంకటేశ్ బాబులు సెలెక్ట్ చేసి పవన్‌కి పంపిస్తారట. అన్నీ సజావుగా సాగితే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మరో రెండునెలల తర్వాత బయటకు రావచ్చు.