English | Telugu

క్వీన్ కంగనాపై తెలుగు కన్ను

 

హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన "క్వీన్" సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ చిత్ర మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని కొంతమంది దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది. హిందీలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దాంతో ఎలాగైనా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి, ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించాలని కొంతమంది బడా నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర తెలుగు రీమేక్ కోసం కొంతమంది నిర్మాతలు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని తెలిసింది. మరి ఈ సినిమా రీమేక్ హక్కులు ఏ నిర్మాతకు దక్కుతాయో త్వరలోనే తెలియనుంది.