English | Telugu
సూపర్ స్టార్ గా రానున్న కమల్
Updated : Jan 4, 2014
"విశ్వరూపం 2" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న కమల్ హాసన్ తన తరువాతి చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. వయసు మీద పడినంత మాత్రాన సూపర్ స్టార్ గా రాణించే అవకాశం లేదనే అభిప్రాయాన్ని మార్చే విధంగా ఈ చిత్రం ఉండబోతుందట. ఇందులో కమల్ సూపర్ స్టార్ గా నటించనున్నాడు. కమల్ స్నేహితుడు అనంత్ ఇందులో ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. "విశ్వరూపం 2" చిత్రం విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.