English | Telugu
తారక్ యంగ్ స్టార్ అవుతాడా...?
Updated : Jan 4, 2014
ఏ సినిమా హిట్టయిన కూడా ఆ దర్శకుడితో తన తరువాతి చిత్రాన్ని చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇపుడు మహేష్ దర్శకుడిని పట్టుకున్నాడు. మహేష్ తో సుకుమార్ తెరకెక్కించిన "1" సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోవడం, సినిమా సాటిలైట్ రైట్స్ అత్యధిక రేటుకు అమ్ముడుపోవడం వలన ఈ సినిమా ఎలాగైనే విజయం సాధిస్తుందని టాలీవుడ్ మొత్తం నమ్మకంతో ఉంది. అయితే సుకుమార్ తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇటీవలే సుకుమార్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఈ చిత్రానికి "యంగ్ స్టార్" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా తెలిసింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ "రభస" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ ల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.