English | Telugu
'ప్రాజెక్ట్ k'లో విలన్ గా కమల్ హాసన్!
Updated : May 31, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన పలువురు స్టార్స్ నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ సంచలన న్యూస్ వినిపిస్తోంది.
'ప్రాజెక్ట్ k' ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఇందులో నటించే ఇతర స్టార్స్, ముఖ్యంగా విలన్ ఎవరనే దానిని ఇంతవరకు రివీల్ చేయలేదు మూవీ టీమ్. అయితే ఇందులో విలన్ గా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కమల్ సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారని అంటున్నారు. 'ప్రాజెక్ట్ k'లో విలన్ గా కమల్ నటిస్తున్నారనే విషయాన్ని విడుదలకు రెండు-మూడు నెలల ముందు ప్రకటించి, ఒక్కసారిగా సినిమాపై అంచనాలకు మరోస్థాయికి తీసుకెళ్లాలనేది మూవీ టీం ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే 'బాహుబలి-2' రేంజ్ లో తెలుగు, హిందీతో పాటు తమిళ్ లోనూ 'ప్రాజెక్ట్ k' సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలీదు గానీ, నిజంగానే కమల్ ని ప్రభాస్ ఢీ కొంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 12న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. అలాగే ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.