English | Telugu

కళ్యాణ్ రామ్ పాత కత్తితో రాబోతున్నాడా ?

 

"ఓం" వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ మరో సినిమా చేయడానికి చాలా ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే "అతనొక్కడే" చిత్రం తర్వాత వరుసగా తనకు ఫ్లాపులు రావడంతో కాస్త డైలమాలో పడ్డాడు. త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు కళ్యాణ్ రామ్. కానీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టేట్లుగా ఉంది. అందుకే హీరోగా ఓ చిత్రానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

కళ్యాణ్ రామ్ తో "కత్తి" వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మల్లిఖార్జున్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు మే15న లాంఛనంగా ప్రారంభం కానున్నాయని సమాచారం. మే చివరి వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు, నిర్మాత కొమరం వెంకటేష్ నిర్మించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.