English | Telugu
శింబుని కమెడియన్ గా చేసిన నయనతార
Updated : May 3, 2014
నయనతార, శింబు ప్రేమాయణం మళ్ళీ చిగురించిందని, ప్రస్తుతం వీరిద్దరూ మళ్ళీ ప్రేమలో మునిగితేలుతున్నారని వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. బయట ఉన్న జనాలకే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందేమో అనే ఆలోచనలు రావడం ఎంత సహజమో... వీరిద్దరూ స్నేహితులకు కూడా ఇలాంటి ఆలోచనలు రావడం కూడా అంతే సహజం. అయితే ఇటీవలే ఇదే విషయం గురించి నయనతార స్నేహితులు నయన వద్ద "మళ్ళీ శింబుకి దగ్గరవుతున్నావ్.. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చి ప్రేమలో పడిన పడతావ్" అని సరదాగా హెచ్చరించారట. దానికి నయన్ స్పందిస్తూ..."అంత సీన్ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు శింబు అయినా ఒకటే శివకార్తికేయాన్ అయినా ఒకటే" అని ఘాటుగా చెప్పిందట.
అంతే... సీన్ కట్ చేస్తే.. ఈ విషయం శింబు చెవిలో పడిందట. దాంతో "నన్ను ఒక కమెడియన్ తో పోల్చడమేంటి" అని అనుకుంటూ నయన్ పై శింబు చాలా కోపంగా ఉన్నాడట. వీరిద్దరూ కలిసి నటిస్తున్న షూటింగ్ లో కూడా ఇద్దరు ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారని తెలిసింది. వీరిద్దరి ప్రేమ రుసరుసల వల్ల ఈ చిత్ర దర్శకనిర్మాతలు తలబాదుకుంటున్నారట. మరి ఈ సినిమా పూర్తయ్యేసరికి ఇంకెన్ని వార్తలు బయటకు వస్తాయో చూడాలి.