English | Telugu
'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా జాన్వీ కపూర్!
Updated : Nov 2, 2022
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెల లాంచ్ కానుందని, వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్'లో హీరోయిన్ గా నటించనుంది అంటూ సౌత్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పటిదాకా ఎందరో బ్యూటీల పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల జాన్వీ సైతం తనకు ఎన్టీఆర్ తో నటించాలని ఉందని, ఆయనతో నటించే అవకాశమొస్తే వదులుకోనని చెప్పింది. అయితే ఆమెకు నిజంగానే 'ఎన్టీఆర్ 30'లో నటించే అవకాశమొచ్చిందని న్యూస్ వినిపిస్తోంది. ఎందరో హీరోయిన్ల పేర్లను పరిశీలించిన మూవీ టీమ్ ఫైనల్ గా జాన్వీకే ఓటేశారని, ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అదే జరిగితే జాన్వీ నటించే తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.