English | Telugu
రామ్, కరుణాకర్ చిత్రం"మనప్రేమ కథ"...?
Updated : Feb 23, 2011
యువ హీరో రామ్ ప్రస్త్రుతం "కందిరీగ" అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం శరవేగంగా నిర్మించబడుతోంది.ఈ చిత్రం తర్వాత రామ్ హీరోగా నటించే చిత్రం ఏమిటంటే అది "మన ప్రేమ కథ" అని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో పవర్ స్టార్ పవన్ హీరోగా, కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించగా బ్లాక్ బస్టర్ హిట్టయిన "తొలి ప్రేమ" చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కరుణాకర్, రామ్ హీరోగా నటించబోయే ఈ "మన ప్రేమ కథ" చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.ఇటీవల ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన "డార్లింగ్" చిత్రానికి కరుణాకర్ దర్శకత్వం వహించారు. కరుణాకర్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించబోయే "మన ప్రేమ కథ" అనే చిత్రం ఒక నెల రోజుల్లో షూటింగ్ ప్రారంభించుకుంటుందని వినికిడి.