English | Telugu

హనుమాన్ దర్శకుడుకి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందా?

హనుమాన్ తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ పేరు మారుమోగిపోతుంది. ఒక రకంగా ఆయన  పాన్ ఇండియా దర్శకుడుగా మారినట్టే. అలాగే  హనుమాన్ ని తక్కువ బడ్జట్ లో  హై క్వాలిటీ తో తెరకెక్కించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచాడు. తాజాగా ఆయనకీ ఒక బంపర్ ఆఫర్ వచ్చింది.

బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఒక మూవీ చేయబోతున్నాడనే రూమర్ ఫిలిం సర్కిల్స్ లో  చక్కర్లు కొడుతుంది. స్వాతంత్య్రం నాటి ఉద్యమ పరిస్థితుల  నేపథ్యంలో ఆ మూవీ ఉండబోతుందని అంటున్నారు. అలాగే కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే కనుక ప్రశాంత్ వర్మ కి అది ఒక మంచి 
అవకాశం అని చెప్పవచ్చు.అయితే  అఫీషియల్ గా మాత్రం ఎలాంటి  అనౌన్స్ మెంట్ రాలేదు. 

ఇక హనుమాన్ ఇటీవలే యాభై రోజులని పూర్తి చేసుకుంది. 300 కోట్లకి పైగానే కలెక్షన్స్ ని సాధించింది.  తేజ సజ్జ, అమృత అయ్యర్ లు హీరో హీరోయిన్లుగా చాలా చక్కగా చేసారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని లు ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.