English | Telugu

రాజమౌళి ఈగ 2వ షెడ్యూల్లో

రాజమౌళి "ఈగ" 2వ షెడ్యూల్లో ఉందని సమాచారం. వివరాల్లోకి వెళితే నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా, అపజయమెరుగని యువ డైనమిక్ డైరెక్టర్ యస్.యస్.రాజమౌళి నిర్మిస్తున్న ప్రయోగాత్మక చిత్రం "ఈగ". రాజమౌళి "ఈగ" చిత్రానికి మొత్తం బడ్జెట్ 22 కోట్ల రూపాయల ఖర్చవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. రాజమౌళి "ఈగ" చిత్రానికయ్యే 22 కోట్లలో అయిదు కోట్ల రూపాయల ఖర్చు కేవలం ఈ చిత్రంలోని యానిమేషన్ దృశ్యాలకే ఖర్చు కానుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

మాములుగా యన్ టి ఆర్, ప్రభాస్, రవితేజ రామ్ చరణ్ వంటి పెద్ద హీరోల సినిమాలకు కూడా ఏ డైరెక్టర్ కూడా ఖర్చు పెట్టని మొత్తాన్ని ఈ "ఈగ" చిత్రానికి రాజమౌళి ఖర్చు చేస్తున్నాడంటే అది అతని మీద అతనికున్న నమ్మకం మాత్రమేనని చెప్పాలి. అదీ కాక నాని వంటి వర్థమాన హీరోపై ఇరవైరెండు కోట్లు ఖర్చు చెయ్యటమంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అఫ్ కోర్స్ నాని ఇటీవల నటించిన "అలా మొదలైంది" చిత్రం మంచి హిట్టయ్యిందనుకోండి. ప్రస్తుతం ఈ రాజమౌళి "ఈగ" 2వ షెడ్యూల్ జరుపుకోబోతుంది.