English | Telugu

రానాకి మీడియాకి మధ్య అడ్డుగోడ

రానాకి మీడియాకి మధ్య అడ్డుగోడగా ఎవరో అడ్డుపడుతున్నారని ఎలక్ట్రానిక్ మీడియా అంటోంది. వివరాల్లోకి వెళితే మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడుగారి మనవడు, విక్టరీ వెంకటేష్ అన్నగారబ్బాయి, సురేష్ బాబు తనయుడు అయిన యువ హీరో రానా దగ్గుపాటి తెలుగులో తొలి చిత్రంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లీడర్" అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం విడుదలైనప్పుడు ఆ సినిమా ప్రమోషన్లలో హీరోగా రానా అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా అందుబాటులో ఉండే వాడు.

కానీ "దమ్ మారో దమ్" అనే హిందీ చిత్రం పుణ్యమాని రానా మన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు దొరకటం లేదని ఎలక్ట్రానిక్ రిపోర్టర్లంటున్నారు. అందుకు ఆయన వద్ద ఉండే ఆయన పి.ఎ. అడ్డుపడుతూందని కూడా వారంటున్నారు. ఒక ప్రముఖ ఛానల్ రిపోర్టర్ ముడుసార్లు రానాతో లైవ్ ప్రోగ్రామ్ చేద్దామనుకుని భంగపడ్డాడట. నిజానికి రానా ఏ భేషిజాలూ లేని హీరో. మనిషిగా అందరితో చక్కగా కలివిడిగా కలసి మెలిసి ఉండే మనస్తత్వం యువ హీరో రానాది. రానా చాలా సంస్కారం కలిగిన వ్యక్తి. మరి ఈ తేడా ఎక్కడ వచ్చిందో రానా త్వరగా తెలుసుకుని తన "నేను నా రాక్షసి" చిత్రాన్ని ప్రమోట్‍ చేసుకుంటాడని ఆశిద్దాం.