English | Telugu
యన్ టి ఆర్ "దమ్ము"ఫిబ్రవరి 20 కి పూర్తి
Updated : Jan 6, 2012
యన్ టి ఆర్ "దమ్ము"ఫిబ్రవరి 20 కి పూర్తికానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు సమర్పణలో, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో, యువ నిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "దమ్ము".
ఈ "దమ్ము" చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతూంది. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం టాకీ పార్టి జనవరి 25 వ తేదీన తమిళనాడులోని పొల్లాచ్చికి ఈ చిత్రం యూనిట్ బయలుదేరనుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సీన్లు, పాటలను చిత్రీకరిస్తారు.
ఇది ఎప్పుడో ప్లాన్ చేసినా అక్కడి వాతావరణం అనుకూలించక చిత్రీకరించలేదు. ఫిబ్రవరి 20 వ తేదీకల్లా ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అంటే మార్చ్ మొదటి వారంలో కానీ, రెండవ వారంలో కానీ "దమ్ము" ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.