English | Telugu
రజనీతో రహస్యంగా చిరంజీవి
Updated : Mar 6, 2011
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో మెగాస్టార్ చిరంజీవి రహస్యంగా మాట్లాడారు. ఏం మాట్లాడారు...? దేనిగురించి ఈ రజనీ, చిరంజీవిల మధ్య జరిగిన రహస్య మంతనాలు. ఈ రజనీ, చిరంజీవిల మధ్య జరిగిన రహస్య మంతనాలు రాజకీయాలకు సంబంధించి మాత్రం కాదు.మరి దేని గురించి...? దేని గురించి రజనీ, చిరంజీవిల మధ్య జరిగిన రహస్య మంతనాలు అంటే తమిళంలో మొన్నజనవరిలో సంక్రాంతికి ధనుష్ హీరోగా నటించగా విడుదలై ఘనవిజయం సాధించిన "ఆడు కాలమ్" చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కుల కోసం రజనీ, చిరంజీవిల మధ్య జరిగిన రహస్య మంతనాలు అవి.
చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ రెండు సంవత్సరాల పాటు "ఆరెంజ్" చిత్రం కోసం వృధా చేసుకున్నా ఆ చిత్రం ఫ్లాపవటంతో, అతనికి ఒక మంచి స్క్రిప్ట్ ఉన్న కథ కావాలని చూస్తున్నారు. ఆ సమయంలో రజనీ కాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన "ఆడుకాలమ్" చిత్రం గురించి చిరంజీవికి తెలిసింది. రజనీకాంత్ తనకు స్నేహితుడే కదాని తన కొడుకు భవిష్యత్తు కోసం చిరంజీవి ఆ చిత్రం యొక్క రీమేక్ హక్కుల తమకే ఇప్పించమని రజనీ కాంత్ ని కోరినట్లు సమాచారం.