English | Telugu
వినయ్ దర్శకత్వంలో చిరు 150 మూవీ
Updated : Apr 24, 2011
వినయ్ దర్శకత్వంలో చిరు 150 మూవీ రాబోతూందని మనకు ఓ సంవత్సరం క్రితమే తెలిసిన విషయం. వివరాల్లోకి వెళితే యువ హీరో రామ్ చరణ్ తేజ నిర్మాతగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో,మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటించబోయే 150 వ చిత్రం ప్రారంభం కాబోతూందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. చిరంజీవి "ప్రజారాజ్యం" అనే రాజకీయ పార్టీని స్థాపించి "సామాజిక న్యాయం" అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చారు. కానీ ఆ "ప్రజారాజ్యం" పార్టీని ఆ తర్వాత ఆయన కాంగ్రేస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ తన 150 వ సినిమా గురించి మరచిపోయారు.
మళ్ళీ ఈ మధ్య ఆయన తన 150 వ చిత్రం ప్రారంభించటం గురించి ఆలోచిస్తున్నారట. ఫిలిం నగర్ వర్గాల కథనం ప్రకారం వినాయక్ దర్శకత్వంలో, మెగాస్టార్ నటించబోయే ఈ 150 వ చిత్రానికి "సామాజిక న్యాయం" అన్న పేరు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సినిమాకి నిర్మాత రామ్ చరణ్ మాటల ప్రకారం చాలా భారీబడ్జెట్ ఖర్చవుతుందని సినీవర్గాలంటున్నాయి. మెగాస్టార్ నటించబోయే 150 వ చిత్రానికి సంబంధించిన విషయం త్వరలోనే పూర్తి వివరాలతో అందిస్తాము.