English | Telugu
పవన్ తీన్ మార్ కు సెన్సార్ నోటీస్
Updated : Apr 25, 2011
పవన్ "తీన్ మార్" కు సెన్సార్ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, గణేష్ నిర్మించిన చిత్రం "తీన్ మార్". ఈ చిత్రానికి సెన్సారు వారు "యు/ఎ" సర్టిఫికేట్ నిచ్చారు. ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ త్రిషల మధ్య లిప్ లాక్ సీన్ ని తొలగించమని సెన్సారు వారు నిర్మాత గణేష్ కి చెప్పారు. ఆ లిప్ లాక్ సీన్ తొలగించకుండానే గణేష్ ఈ "తీన్ మార్" చిత్రాన్ని ఆడిస్తుండటంతో అతనికి సెన్సార్ నోటీసులు జారీ చేయనుందని సమాచారం.
ఇలా సెన్సార్ నిర్మాత గణేష్ కి నోటీసులు జారీ చేయటం వెనుక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ హస్తముందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అలాగే ఈ విషయంలో శిరీష్ కి లోకల్ యమ్.యల్.ఎ.సహకరిస్తున్నారని కూడా ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. "తీన్ మార్" చిత్రం మొదట మంచి టాక్ ను సంపాదించుకుని సూపర్ హిట్టనిపించినా, ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" రిలీజ్ తర్వాత "తీన్ మార్" చిత్రానికి ప్రేక్షకాదరణ తగ్గినట్లుగా అనిపిస్తుంది. దీనితో పాటు సెన్సార్ సమస్య పుండు మీద కారం జల్లినట్లుగా గణేష్ ని వేధించటం శోచనీయం. భార్య శ్రీజ మీద కోపం చిన మామ పవన్ కళ్యాణ్ సినిమా "తీన్ మార్" మీద చూపించటం ఫిలిం నగర్ వర్గాలు గర్హిస్తున్నాయి.