English | Telugu

జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. కొరటాల ఇలా చేశాడేంటి..?

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 'దేవర' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే పలు హిందీ చిత్రాలు చేసిన జాన్వీ.. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే.. సోషల్ మీడియా ద్వారా ఇక్కడి యువతకు కూడా చేరువైంది. పైగా తెలుగునాట శ్రీదేవిని ఎంతలా అభిమానిస్తారో తెలిసిందే. అసలే శ్రీదేవి కుమార్తె కావడం, దానికితోడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సరసన నటించిన భారీ చిత్రం 'దేవర'తో తెలుగులో అడుగుపెడుతుండటంతో.. అందరూ ఆమె ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే జాన్వీ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే న్యూస్ ఒకటి వినిపిస్తోంది. (Devara Movie)

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగు పెట్టనుంది. కేవలం ఎన్టీఆర్ కోసమే కాకుండా.. జాన్వీ కోసం కూడా ఈ సినిమా చూడాలనుకునే ఎందరో ఉన్నారు. పైగా ఇప్పటికే 'చుట్టమల్లే' సాంగ్ లో తన గ్లామర్ తో కట్టిపడేయంతో.. బిగ్ స్క్రీన్ పై జాన్వీని చూడాలనుకునే వారి సంఖ్య మరింత పెరిగింది. అయితే ఇప్పుడు వారందరికీ బ్యాడ్ న్యూస్. దేవర పార్ట్-1 లో జాన్వీ రోల్ ఎంతో సేపు ఉండదట. కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని అంటున్నారు. అందులో 'చుట్టమల్లే' పాటే మూడున్నర నిమిషాల ఉంటుంది. అది కాకుండా కొన్ని లవ్ సీన్స్ తో.. పది నిమిషాలకు పైగా జాన్వీ స్క్రీన్ టైం ఉంటుందట. ఇక 'దావుది' రూపంలో మరో సాంగ్ ఉండగా.. అది కేవలం రోలింగ్ టైటిల్స్ కే పరిమితమని టాక్. ఇప్పుడసలు ఆ సాంగ్ ని పూర్తిగా తొలగించారని కూడా న్యూస్ వినిపిస్తోంది. ఈ లెక్కన జాన్వీని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకొని థియేటర్ కు వెళ్లేవారికి.. ఇది బిగ్ డిజప్పాయింట్మెంట్ అని చెప్పవచ్చు.

ఆమధ్య జాన్వీ సైతం బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. దేవర పార్ట్-1 లో తన పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని, పార్ట్-2 లో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే ఎంత తక్కువ ఉన్నప్పటికీ.. మరీ 15 నిమిషాలే ఆమె స్క్రీన్ టైం ఉండటం అనేది ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ కలిగించే విషయం.