English | Telugu
సీటు పై కన్నేసాడా?
Updated : Jun 27, 2013
నటుడిగా ఓ గుర్తింపు సంపాదించుకొని, నిర్మాతగా మారి ఎవరికి అర్థం కానీ సక్సెస్ ఫుల్ భారీ నిర్మాత బండ్ల గణేష్. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో "ఆంజనేయులు" చిత్రంతో నిర్మాతగా మారి... "తీన్ మార్", "గబ్బర్ సింగ్", "బాద్ షా", "ఇద్దరమ్మాయిలతో" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉంటున్న బండ్ల గణేష్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేయనున్నట్లు తెలిసింది.
గణేష్ నిర్మాతగా మారడానికి సహాయం చేసిన బొత్స సత్యనారాయణతో, అదే విధంగా పవన్ కళ్యాణ్ తో "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీయడంతో మెగా ఫ్యామిలీతో కూడా మంచి అనుబందం ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ లో ఉన్న ఈ ఇద్దరు అగ్రగణ్యులతో (బొత్స, చిరంజీవి) కూడా మంచి అనుబందం ఉండడంతో గణేష్ కు ఎమ్మెల్యే పదవి రావడం ఖాయమని అటు సినీ ఇండస్ట్రీ తో పాటు, ఇటు రాజకీయ ప్రముఖులు కూడా చర్చించుకుంటున్నారు. మారి నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ త్వరలోనే ఎమ్మెల్యే అవతారమెత్తుతాడో లేదో చూడాలి?