English | Telugu

బాలయ్య హీరోగా బెల్లంకొండ చిత్రం

బాలయ్య హీరోగా బెల్లంకొండ చిత్రం ప్రారంభించబోతున్నారు. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ హీరోగా, "చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ" వంటి చిత్రాలను బెల్లంకొండ సురేష్ నిర్మించారు. గతంలో " లక్ష్యం, రామరామ కృష్ణ కృష్ణ" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న ఈ చిత్రానికి "భీష్మ" అన్న పేరుని నిర్ణయించారు. త్వరలోనే నిర్మాత బెల్లంకొండ సురేష్ పూర్తి వివరాలను వెల్లడించనున్నారని ఫిలిం నగర్ వర్గాల కథనం.