English | Telugu

కృష్ణుడిగా బాలకృష్ణ.. అర్జునుడిగా ఎన్టీఆర్...

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ మొదటి సినిమాకి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ ఆంచనాలు ఆకాశాన్ని తాకే న్యూస్ ఒకటి వినిపిస్తోంది. (Nandamuri Mokshagna)

మోక్షజ్ఞ మొదటి సినిమా మహాభారతం నేపథ్యంలో ఉంటుందట. ఇందులో అభిమన్యుడు పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక మహాభారతం నేపథ్యంలో వచ్చే కీలక ఎపిసోడ్ లో అభిమన్యుడుతో పాటు కృష్ణుడు, అర్జునుడు పాత్రలను ప్రధానంగా చూపిస్తారంట. అంతేకాదు ఈ రెండు పాత్రల్లో నందమూరి హీరోలు బాలకృష్ణ (Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కనిపిస్తారని వినికిడి. కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారని ఇండస్ట్రీ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఇలా ఒకే సినిమాలో ముగ్గురు నందమూరి హీరోలు, అందులోనూ పౌరాణిక పాత్రల్లో కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. అప్పట్లో 'దాన వీర శూర కర్ణ' చిత్రంలో కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్, అర్జునుడిగా హరికృష్ణ, అభిమన్యుడిగా బాలకృష్ణ కనిపించారు. ఇక ఇప్పుడు కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, అర్జునుడిగా హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్, అభిమన్యుడిగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కనిపిస్తే.. అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. నిజంగానే ఈ ముగ్గురు కలిసి నటిస్తే, ఆ సినిమా సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.