English | Telugu
'దేవర'లో మరో తెలుగు హీరో.. ఎవరో తెలుసా?
Updated : Dec 27, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ హీరో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్.
'దేవర' చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఓ ప్రత్యేక పాత్ర కూడా పోషిస్తున్నాడట. ఈ విషయాన్ని విడుదలకు కొద్దిరోజుల ముందు అఫీషియల్ గా రివీల్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోందట. ఈ రోల్ నిడివి కొద్దిసేపే అయినప్పటికీ, కథకి కీలకం కావడంతో చిత్ర బృందం.. కళ్యాణ్ రామ్ ని రంగంలోకి దించినట్లు వినికిడి.
కాగా ఇతర సినిమాల విషయానికొస్తే.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వచ్చే ఏడాది 'బింబిసార-2'తో బిజీ కానున్నాడు ఈ నందమూరి హీరో.