English | Telugu

అందులోకి దూకుతుందట!

 

యాంకర్ గా మెప్పించి, నటిగా తన సత్తా చూపుతూ, వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ ముందుకు వెళ్తుంది స్లిమ్ లేడి ఉదయ భాను. అయితే ఈ భామ ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గతంలో ఉదయ భాను తండ్రి మొయినుద్దీన్ కరీంనగర్ జిల్లాకు చెందిన కోహేడకు 3సార్లు సర్పంచ్ గా పనిచేశారు. అయితే అయన మరణం తర్వాత ఉదయ భాను హైదరాబాద్ కి రావడం, ఇక్కడే స్థిరపడటం జరిగిపోయాయి.

 

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు, అందుకు బి.జె.పి. పార్టీలో చేరి, కోహెడకు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. అక్కడి నుంచే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. మరి ఈ అమ్మడు అధికారికంగా ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.