English | Telugu
అల్లరి నరేష్‌తో చేస్తే అంతే!
Updated : Jun 26, 2013
అదేంటోగానీ... అల్లరి నరేష్‌తో నటించే హీరోయిన్ల పరిస్థితి ఘోరంగా ఉంటోంది. సినిమా ఫ్లాపయి అవకాశాలు రాకపోతే.. అది వేరే విషయం. సినిమాలు హిట్టయినా కూడా అదే పరిస్థితి ఎదురవుతుండడం సదరు హీరోయిన్లకు పిచ్చెక్కేలా చేస్తోంది. "అహ నా పెళ్లంట"లో నటించిన రీతూ బర్మేచా, "బ్లేడు బాబ్జీ"లో నటించిన సయాలీ భగత్, "సుడిగాడు"లో నటించిన మోనాల్ గజ్జర్, "సీమటపాకాయ్" సుందరి పూర్ణలకు ఇప్పటివరకూ అవకాశాలు రాలేదు. ఈ నాలుగు చిత్రాలు మంచి హిట్స్.
ఇంకొంచెం వెనక్కి వెళితే. ."నేను"లో అల్లరినరేష్‌తో నటించిన అర్చన (వేద, అల్లరినరేష్‌కు "కితకితలు"పెట్టిన మధుశాలిని, "ఫిట్టింగ్ మాస్టర్" కథానాయకి మదాలస శర్మల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆ మధ్య వచ్చిన "యముడికి మొగుడు" చిత్రంలో నరేష్‌తో అల్లరి చేసిన రిచాపనయ్‌కు కూడా ఇంతవరకు మరో చిత్రం రాలేదు. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ హీరోలకు మాత్రమే ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ లిస్టులో అల్లరి నరేష్ చేరడం విశేషం!