English | Telugu
అక్కినేని కాంపౌండ్ నుంచి పూరి జగన్నాథ్‌కి పిలుపు... ఇంతకీ సినిమా ఎవరితో?
Updated : Oct 17, 2024
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్‌ది ఒక డిఫరెంట్ స్టైల్. ఏ డైరెక్టర్‌కీ రాని డిఫరెంట్ థాట్స్ పూరికి వస్తాయి. పూరి సినిమాల్లోని హీరోల క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే విలన్స్ కూడా డిఫరెంట్ మేనరిజమ్స్‌తో బిహేవ్ చేస్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే వరస హిట్స్ తీసి టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యూత్‌లో పూరీకి మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్నాయి. అందుకే వారికి నచ్చే విధంగా కథలు రెడీ చేసుకుంటారు. అలాగే తనకు నచ్చిన విధంగా హీరోలను మౌల్డ్ చేసుకుంటారు. అలా తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నారు పూరి. బాలకృష్ణ, నాగార్జున, మహేష్, రవితేజ, ఎన్టీఆర్ వంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ చేసిన పూరికి ఈమధ్యకాలంలో హిట్ అనేది కరువైపోయింది. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరికి ఇస్మార్ట్ శంకర్‌తో మంచి కంబ్యాక్ వచ్చింది. కానీ, ఆ తర్వాత చేసిన లైగర్ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత తనకు కంబ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా చేసిన డబుల్ ఇస్మార్ట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, అది కూడా నిరాశపరిచింది.
పూరి దగ్గర స్టఫ్ అయిపోయింది, ఇక రిటైర్ అయితే మంచిది అనే కామెంట్స్ వచ్చాయి. అయితే అవి ఇండస్ట్రీ నుంచి వచ్చాయి తప్ప ఆడియన్స్ నుంచి కాదు. పూరి నుంచి ఒక డిఫరెంట్ మూవీ వస్తే హిట్ చెయ్యడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. అది పూరి చేతుల్లోనే ఉంది. తనకు వచ్చిన గ్యాప్‌లో కథలు రెడీ చేసుకుంటూనే హీరో కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అదే సమయంలో అక్కినేని కాంపౌండ్ నుంచి పూరీకి పిలుపు వచ్చింది. అక్కినేని కాంపౌండ్‌లో కూడా ఈమధ్య హిట్లు అనేవి కరువైపోయాయి.
ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగాతో సందడి చేసిన నాగార్జున ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర చిత్రంలో నటిస్తున్నారు. నాగచైతన్యకు ఈమధ్యకాలంలో హిట్స్ లేవు. ఇక అఖిల్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఓ అరడజను సినిమాలు చేసినా ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అతని చివరి సినిమా ఏజెంట్ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సమయంలో పూరి జగన్నాథ్ వంటి డైరెక్టర్ అయితేనే తమని ఫ్లాపుల నుంచి గట్టెక్కించగలరని అక్కినేని హీరోలు భావిస్తున్నట్టున్నారు. అందుకే అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలలో ఎవరికైనా సెట్ అయ్యే కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పూరి అదే పనిలో ఉన్నారని సమాచారం. మరి వీరిలో ఎవరికి కథ సెట్ అవుతుందో, పూరి ఎవరితో సినిమా చేస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పదు.