English | Telugu

అల్లు అర్జున్‌ ఇంటిపై విద్యార్థుల దాడి.. ఉద్రిక్తంగా అక్కడి వాతావరణం!

Publish Date:Dec 22, 2024

సంధ్య థియేటర్‌ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, సంఘాలు ఘటన పట్ల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో దీనిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ జెఎసి ఆధ్వర్యంలో విద్యార్థులు అల్లు అర్జున్‌ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు, ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. కొందరు ఆకతాయిలు ఇంటిపైకి టమాటాలు విసిరారు. న్యాయం చెయ్యాలి అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. 

Theatres are like temple to me - Allu Arjun

Publish Date:Dec 21, 2024

Allu Arjun came out in front of press to counter allegations leveled by CM Revanth Reddy. In Telangana Assembly, Revanth Reddy made allegations that even though police denied permission on 4th December night and even stated that Allu Arjun acted inhumane when police asked him to leave.  Countering to these allegations, Allu Arjun stated, "I never even in my wildest dream and nightmare I would want someone to be effected while watching my film. i work in films to entertain people and I can't imagine someone being hurt watching my film. My life ambition is to entertain people and not to hurt them, I want to win hearts."  He continued to say, "Theatres are like a temple to me and I wanted to see audience reactions to my film. Hence, I went to watch premiere." He stated that police were controlling the crowd assembled there at Sandhya theatre and if they would have told him, there was no permission, he would have gone back.    Allu Arjun continued to say that when police asked him to leave, he immediately left, leaving his kids behind. He further clearly stated that after knowing that someone died, he wanted to meet them personally and wanted to support them. As the family filed a case against him, he is unable to till date.  He classified it as an "unfortunate accident" and as it was a make or break moment for him, he wanted to watch the movie as he worked three years on the film. Finally, he stated that he is not blaming anyone but clearly called comments from CM as "false allegations". He also stated that 2 yards before the theatre, he waved at them but he did not conduct any roadshow. He tried to clear the crowd by waving but did not tried to showcase his strength with any procession.  He also stated that theatre management asked him to leave but not police as being told. He stated that the management stated that there was some issue with crowd and hence, he walked out. 

ఒకే పాత్రను కొన్ని వందల సినిమాల్లో చేసి మెప్పించిన మేటి నటి సూర్యకాంతం!

Publish Date:Dec 18, 2024

తాము చేస్తున్న సినిమాల్లో ఒకే తరహా పాత్రలు పోషించి మెప్పించడం నటీనటులకు చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ప్రతి సినిమాలోనూ అదే పాత్ర చేయడం వారికి విసుగు తెప్పిస్తుంది కూడా. కానీ, పాతతరం నటి సూర్యకాంతం తన విషయంలో అది కరెక్ట్‌ కాదని నిరూపించారు. గయ్యాళి అత్త అంటే మనకు సూర్యకాంతం గుర్తొస్తారు. ఆ పాత్రకు పేటెంట్‌ హక్కులు పూర్తిగా ఆమెవే. ఆమె పేరు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో అంతలా ముద్రపడిపోయింది. దాదాపు 50 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో 700కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. వాటిలో దాదాపు అన్నీ గయ్యాళి పాత్రలే ఉండడం అనేది గొప్ప విషయం. అలా వరసగా గయ్యాళి పాత్రలు చేసి ప్రేక్షకులకు బోర్‌ కొట్టించని ఏకైక నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రల ప్రభావం ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా ఉందంటే సూర్యకాంతం అనే పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకునే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేదు. అలాంటి విశిష్టమైన నటి సూర్యకాంతం సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆమె సినీ, జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. 1924 అక్టోబర్‌ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు సూర్యకాంతం 14వ సంతానం. అందరి కంటే చిన్నది కావడంతో ఆమెను ఎంతో గారాబం చేసేవారు. చిన్నతనం నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తెలుగు కంటే హిందీ సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. ఆ సినిమాలు చూసి అందులోని పాటలు పాడుతూ ఉండేవారు. సూర్యకాంతం స్కూల్‌లో వేసే నాటకాల్లో నటించేవారు. ఇది తెలిసి తల్లి మందలించినా అవేవీ పట్టించుకోకుండా నాటకాల్లో కొనసాగేవారు. ఆమె 8వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి అనంతరామయ్య కన్నుమూశారు. ఆ తర్వాత కూడా సూర్యకాంతం స్కూల్‌లో నాటకాలు వేశారు. ఆ సమయంలోనే వారి బంధువు ఒకరు హనుమాన్‌ నాట్యమండలి అనే నాటక సంస్థను నడిపేవారు. అందులో అందరూ ఆడవారే ఉండేవారు. దీంతో సూర్యకాంతం కూడా అందులో చేరి సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాబారం వంటి నాటకాల్లో నటించారు.  ఆ సమయంలోనే జెమిని సంస్థవారు తాము నిర్మిస్తున్న చంద్రలేఖ సినిమాలో నూతన నటీనటులు కావాలి అని పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. అది చూసిన సూర్యకాంతం స్నేహితురాళ్లు ఇద్దరు మద్రాస్‌ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వారితోపాటు సూర్యకాంతం కూడా వెళ్లారు. చంద్రలేఖ సినిమాలో ఈ ముగ్గురికీ చిన్న చిన్న వేషాలు ఇచ్చారు. అదే సమయంలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న నారద నారది చిత్రంలో ఒక క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఇది తెలుసుకున్న జెమినివారు తమతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న తర్వాత మరో సినిమాలో నటించడానికి వీల్లేదని చెప్పారు. పుల్లయ్య కూడా పెద్ద డైరెక్టరేనని, ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు సూర్యకాంతం. దీంతో జెమినీవారు సూర్యకాంతంకి ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి అడక్కుండా అగ్రిమెంట్‌ని రద్దు చేసుకున్నారు. అలా 1946లో విడుదలైన నారద నారది చిత్రంలో తొలిసారి నటించారు. ఈ సినిమా తర్వాత 1949 వరకు రత్నమాల, గృహప్రవేశం వంటి కొన్ని సినిమాల్లో నటించారు. నిజానికి సూర్యకాంతం హిందీ సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చారు. అయితే తెలుగులో నటిగా నిలదొక్కుకున్న తర్వాతే హిందీలోకి వెళితే బాగుంటుందని దర్శకుడు సి.పుల్లయ్య ఇచ్చిన సలహాను పాటించి తెలుగులోనే నటిగా కొనసాగారు.  1950లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన సంసారం చిత్రంతో సూర్యకాంతం కెరీర్‌ గొప్ప టర్న్‌ తీసుకుంది. ఈ సినిమాలో మొదటిసారి గయ్యాళి అత్తగా నటించారు. ఆ పాత్ర సూర్యకాంతంకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు సూర్యకాంతంను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నీ ఒకే తరహా పాత్రలే అయినా ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఆదరించారు. పెళ్లిచేసిచూడు, దొంగరాముడు, బ్రతుకు తెరువు, మాయాబజార్‌, తోడికోడళ్లు, మాంగల్యబలం, వెలుగు నీడలు, అప్పుచేసి పప్పుకూడు.. ఇలా దాదాపు 20 సంవత్సరాలపాటు సూర్యకాంతం లేని సినిమా అంటూ ఉండేది కాదు. 1962లో సూర్యకాంతం చేసిన గుండమ్మకథకు చాలా విశేషాలు ఉన్నాయి. అప్పటికే ఎన్‌.టి.ఆర్‌. ఎఎన్నార్‌ తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలు. వారిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకి సూర్యకాంతం చేసిన గుండమ్మ క్యారెక్టర్‌ను హైలైట్‌ చేస్తూ గుండమ్మకథ అనే టైటిల్‌ని పెట్టడం ఆరోజుల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ప్రతి సినిమాలోనూ గయ్యాళి పాత్ర పోషించినా.. అందులోనే విభిన్నమైన కోణాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. సూర్యకాంతంను తెరపై చూస్తూ తిట్టుకుంటూనే ఆమె సినిమాలను ఎంతో ఆదరించేవారు.  సినిమాల్లో గయ్యాళి పాత్రలు చేసి అందరితోనూ తిట్లు తినే సూర్యకాంతం నిజ జీవితంలో సౌమ్యంగా ఉండేవారు. పెద్దలను గౌరవించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి గొప్ప లక్షణాలు ఆమెలో ఉండేవి. ఆమె షూటింగ్‌కి వెళుతున్నారంటే 20 మందికి సరిపడే భోజనాలు వెంట తీసుకెళ్ళేవారు. తన సహనటీనటులకు, సాంకేతిక నిపుణులకు వాటిని కొసరి కొసరి వడ్డించేవారు. అంతేకాదు, రకరకాల పిండి వంటలు కూడా చేయించి షూటింగ్‌కి తీసుకొచ్చేవారు. అలా సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు వంటి వారు కూడా ఇంటి నుంచి భోజనాలు తెచ్చేవారు. సూర్యకాంతం సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని ఇతర వ్యాపారాలు కూడా చేసేవారు. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతోపాటు బాపు, రమణ తీసే సినిమాలకు ఫైనాన్స్‌ చేసేవారు. అలాగే పాత కార్లు కొని వాటికి మరమ్మతులు చేయించి, పెయింట్‌ వేయించి తిరిగి అమ్మేవారు. ఆరోజుల్లో నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తున్నాయని గ్రహించిన సూర్యకాంతం.. విదేశాల నుంచి క్వాలిటీగా ఉండే మేకప్‌ కిట్‌లను తెప్పించి నటీనటులకు అమ్మేవారు.  ఇక వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. సూర్యకాంతం నాటకాలు వేసే రోజుల్లోనే న్యాయవాదిగా పనిచేసే పెద్దిభొట్ల చలపతిరావు కూడా నాటకాల్లో నటించేవారు. ఆయన తెనాలి నుంచి మద్రాస్‌ షిప్ట్‌ అయిన తర్వాత 1950లో చలపతిరావును వివాహం చేసుకున్నారు సూర్యకాంతం. వీరికి సంతానం కలగలేదు. దీంతో తన అక్క సత్యవతి కుమారుడ్ని నెలల వయసులోనే దత్తత తీసుకున్నారు. అతనికి అనంత పద్మనాభమూర్తి అని పేరు పెట్టుకున్నారు. సూర్యకాంతంకి దానగుణం ఎక్కువ. వికలాంగులకు, వృద్ధకళాకారులకు ఆర్థికసాయం చేసేవారు. అలాగే సినిమాల్లో నటించాలని వచ్చి అవకాశాలు రాక ఉన్నదంతా పోగొట్టుకొని ఊరికి వెళ్ళడానికి కూడా డబ్బులేని ఎంతో మందిని సొంత ఖర్చులతో ఊళ్ళకు పంపించేవారు. గ్రంథాలయాలకు, నాటక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకునేవారు కాదు. తిరుపతిలో ఆమె పేరుమీద ఒక కాటేజీ ఉండేది. మూడు వారాలకు ఒకసారి అక్కడికి వెళ్లేవారు. సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ గుడికి తరచూ వెళ్లేవారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం ఒక సత్రం కట్టించారు సూర్యకాంతం.  ఆమె ఎంత సున్నిత మనస్కురాలంటే.. ఒక సినిమాలో నటుడు నాగయ్యను నోటికొచ్చినట్టు తిట్టే సీన్‌ చెయ్యాల్సి వచ్చింది. అది పూర్తవ్వగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన కాళ్ళకు నమస్కరించి క్షమించమని వేడుకున్నారు సూర్యకాంతం. ‘నువ్వు కాదు నన్ను తిట్టింది.. నీ పాత్ర.. దానికెందుకమ్మా బాధపడతావు. ఊరుకో’ అని ఓదార్చారు నాగయ్య. స్యూరకాంతం నవలలు ఎక్కువగా చదివేవారు. ఓ పక్క నటిస్తూనే ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చెయ్యాలనుకున్నారు. ప్రతిరోజూ రాత్రి పూట చదువుకునేవారు. దీని వల్ల పగలు షూటింగులో ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన ఛాయాదేవి ‘నటిగా నీకు ఇంత మంచి పేరు ఉంది. డిగ్రీ ఎప్పుడైనా పూర్తి చెయ్యొచ్చు. సినిమా అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు’ అని సీరియస్‌గా చెప్పడంతో డిగ్రీ చెయ్యాలన్న ఆలోచన మానుకున్నారు సూర్యకాంతం. 50 ఏళ్ల వయసులో మరాఠి, ఫ్రెంచ్‌ భాషలు నేర్చుకున్నారు.  చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకునేవారు సూర్యకాంతం. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమాలు మాత్రం మానేవారు కాదు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉండేవారు. చివరికి 1994 డిసెంబర్‌ 18న కన్నుమూశారు సూర్యకాంతం. ఆ సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి నివాళులర్పించారు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. 50 సంవత్సరాలు నటిగా కొనసాగి, దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరు నటీనటులతో కలిసి నటించిన సూర్యకాంతం చనిపోయారన్న వార్త తెలిసి కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి అంజలీదేవి, జమున, అల్లు రామలింగయ్య, జి.వరలక్ష్మీ, వాణిశ్రీ వంటి పది మంది మాత్రమే వచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎవరైనా వస్తారేమోనని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తన సహజ నటనతో లక్షల మంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సూర్యకాంతం ఆత్మకు వారి నివాళే నిజమైన శాంతిని చేకూరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  (డిసెంబర్ 18 సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..)

ఆస్కార్‌పై ఇండియా పెట్టుకున్న ఆశలు అడియాసలేనా.. అయినా కొంత సంతోషమే!

Publish Date:Dec 18, 2024

గత ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఆస్కార్‌ అవార్డు సాధించడంతో అందరూ పండగ చేసుకున్నారు. వరసగా రెండో సంవత్సరం కూడా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకోవాలనే ప్రయత్నం నార్త్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌ అవార్డు వస్తుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే ఒక అద్భుతమైన సినిమాను భారత దేశం తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ చేశారు. ఆమిర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’ చిత్రాన్ని బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు అధికారికంగా పంపారు. అయితే ఈ చిత్రానికి నిరాశే ఎదురైంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ చేసిన షార్ట్‌ లిస్టు నుంచి ఈ సినిమా తప్పుకోవాల్సి వచ్చింది.  లాపతా లేడీస్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అయిన తర్వాత సినిమా టైటిల్‌ను ‘లాస్ట్‌ లేడీస్‌’ గా మార్చారు. లాస్ట్‌ అంటే మిస్సింగ్‌ అనే అర్థం వస్తుంది. నిజానికి ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకోలేకపోవడం ఈ సినిమాకి మిస్సింగ్‌ అనే చెప్పాలి. ఇండియాలో ‘లాపతా లేడీస్‌’ చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. దీంతో ఈ సినిమాను ఆస్కార్‌కి పంపారు. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో 85 సినిమాలు ఉండగా వాటిని షార్ట్‌ ఔట్‌ చేస్తే 15 సినిమాలు మిగిలాయి. అందులో లాపతా లేడీస్‌ లేకపోవడం యూనిట్‌ని ఎంతో బాధించింది.  ఇదిలా ఉంటే.. మరో హిందీ సినిమా ఈ షార్ట్‌ లిస్ట్‌లోకి వచ్చింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలోనే ఆ సినిమా కూడా ఉండడం విశేషం. ఆ సినిమా పేరు ‘సంతోష్‌’. అయితే ఈ సినిమా యూకే నుండి నామినేట్‌ అయింది. నార్త్‌ ఇండియాలోని గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సంధ్య సూరి దర్శకత్వం వహించారు. షహానా గోస్వామి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. తమ సినిమా ష్టార్ట్‌ లిస్ట్‌లో ఉండడంతో ‘సంతోష్‌’ యూనిట్‌ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. మరి ఆ 15 సినిమాల్లో ఏ సినిమాకి ఆస్కార్‌ దక్కుతుందో చూడాలి. 

బ్రహ్మముడి టెలికాస్ట్ టైమింగ్ మారనుందా.. ఇక టీఅర్పీ గోవిందా!

Publish Date:Dec 22, 2024

స్టార్ మా టీవీలో  ప్రసారమయ్యే సీరియల్ బ్రహ్మముడికి యమ క్రేజ్ ఉంది. కానీ దానిని మధ్యాహ్నానికి మార్చేశారు. దాని టీఆర్పీ గోవింద అయింది. ఇప్పుడేమో రాత్రి 10.30 గంటలకు సీరియల్‌ని రీ టెలికాస్ట్ చేయబోతున్నారు. అంటే మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయిన బ్రహ్మముడి సీరియల్‌ని తిరిగి రాత్రి 10.30 గంటలకు రీ టెలికాస్ట్ చేయబోతున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది. కాబట్టి మధ్యాహ్నం మిస్ అయితే రాత్రి చూడొచ్చన్నమాట. కొత్త సీరియల్స్ వస్తున్నాయని.. టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్స్ స్టార్ మా  టైమింగ్స్‌ని మార్చేస్తోంది. ఏ కొత్త సీరియల్ వచ్చినా దాన్ని మంచి ప్రైమ్ టైంలో వదిలి ఆ టైమ్ లో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్‌ని మధ్యాహ్నానికి తోసేస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ విషయంలో ఇదే స్ట్రాటజీతో బొక్క బోర్లాపడ్డ స్టార్ మా.. మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ విషయంలోనే అదే చేసింది. అప్పట్లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ని రాత్రి 7 గంటలకు ప్రసారం అయ్యేది. ఆ టైంలో టీఆర్పీ రేటింగ్‌ని బద్దలు కొట్టేసింది గుప్పెడంత మనసు. ఆ తరువాత కొత్త సీరియల్స్ వస్తున్నాయని.. మధ్యాహ్నానికి మార్చేశారు. దాంతో గుప్పెడంత మనసు టీఅర్పీ పడిపోయింది. ఇప్పుడు ‘బ్రహ్మముడి’ సీరియల్‌ని అలాగే చేస్తున్నారు. ప్రారంభంలో రాత్రి 7.30 గంటలకు ప్రసారం అయ్యేది బ్రహ్మముడి. స్టార్ మా ఛానల్‌లో ఆ టైమ్‌లో టెలికాస్ట్ అయ్యే సీరియల్ అంటే సూపర్ హిట్ కిందే లెక్క. కార్తీకదీపం అదే టైమ్ లో ప్రసారమయ్యే జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్‌గా అనేక రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఆ సీరియల్ అయిపోయిన తరువాత అదే టైమ్ లో రాత్రి 7. 30 గంటలకు బ్రహ్మముడి సీరియల్‌ని ప్రసారం చేశారు. ఈ సీరియల్ కూడా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ని నమోదు చేసింది. అంతకముంది స్టార్ మా ఛానల్‌‌లో ప్రసారమయ్యే సీరియల్స్ రేటింగ్‌లో బ్రహ్మముడికే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చేది. ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు సీరియల్ టాప్ వన్ స్థానంలో నిలిచింది. ప్రైమ్ టైంలో 13-14 తక్కువ కాకుండా టీఆర్పీ రేటింగ్ వచ్చే బ్రహ్మముడి మధ్యాహ్నానికి మార్చేసరికి సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు మళ్లీ రాత్రి 10.30 గంటలకు రీ టెలికాస్ట్ చేసేకంటే.. యధాస్థానంలో అంటే రాత్రి 7.30 గంటలకు ప్రసారం చేస్తేనే బ్రహ్మముడి మళ్ళీ ఆ టీఆర్పీని సొంతం చేసుకోవచ్చు.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

జనసేనలో చేరుతున్న మంచు మనోజ్ అండ్ మౌనిక రెడ్డి?

Publish Date:Dec 16, 2024

1993 లో విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన'మేజర్ చంద్ర కాంత్' చిత్రం ద్వారా బాలనటుడుగా సినీ ఆరంగ్రేటం చేసిన నటుడు మంచు మనోజ్.ఆ తర్వాత కూడా బాలనటుడుగా తన తండ్రి మోహన్ బాబు నటించిన పలు సినిమాల్లో చేసిన మనోజ్ 2005 లో 'సంతోషం' మూవీ ఫేమ్ దశరధ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ' అనే మూవీతో సోలో హీరోగా మారాడు.బిందాస్, మిస్టర్ నూకయ్య,వేదం,రాజుభాయ్,గుంటూరోడు,కరెంటు తీగ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాడు. మనోజ్తన భార్య మౌనికరెడ్డి తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో చేరబోతున్నట్టుగా  వార్తలు వస్తున్నాయి.వాటిల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గాని మనోజ్ అండ్ మౌనికజనసేన లో చేరడం పక్కా అని అంటున్నారు. మనోజ్ కి గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, విష్ణు ల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన లో చేరే వార్త హాట్ టాపిక్ గా మారింది.  పవన్, మనోజ్ మధ్య ఎప్పటినుంచో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయాన్ని  మనోజ్ చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది.ఇక మౌనిక రెడ్డి కూడా మొదటి నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన ఆవిడే.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

విడుదలై 2 

Publish Date:Dec 20, 2024

యూఐ

Publish Date:Dec 20, 2024

పుష్ప 2

Publish Date:Dec 5, 2024

Bachhala Malli

Publish Date:Dec 20, 2024

Mufasa: The Lion King

Publish Date:Dec 20, 2024

Viduthalai Part 2

Publish Date:Dec 20, 2024

UI

Publish Date:Dec 20, 2024

Pushpa 2

Publish Date:Dec 5, 2024