English | Telugu

'కల్కి'గా జూనియర్ ఎన్టీఆర్..!

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. జూన్ 27న విడుదలై, భారీ వసూళ్లతో 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. మహాభారతంలోని పలు కీలక పాత్రలు ఈ చిత్రంలో కనువిందు చేశాయి. అలాగే 'కల్కి 2898 AD' అనే టైటిల్ ప్రకటన వచ్చినప్పుడు.. మొదట ఈ చిత్రంలో కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని భావించారంతా. కానీ ఇందులో ప్రభాస్ భైరవగా కనిపించాడు. అలాగే మహాభారతంలోని ఒక కీలక పాత్రలోనూ సర్ ప్రైజ్ చేశాడు. కానీ 'కల్కి' ఎవరు అనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు.

'కల్కి' యూనివర్స్ లో భాగంగా పలు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే సెకండ్ పార్ట్ ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ లో 'కల్కి-2' విడుదలయ్యే అవకాశముంది. ఇందులోనే 'కల్కి' ఎవరు అనేది రివీల్ కానుంది. అయితే ఈ యూనివర్స్ లో కల్కిగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కనువిందు చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఎన్టీఆర్ తో పాటు పలువురు స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో మెరవనున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. మొదటి భాగమే వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసేలా ఉంది. అలాంటిది రెండో భాగానికి మరికొందరు స్టార్స్ తోడైతే.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఊహలకు కూడా అందదేమో. ఆ దెబ్బకు 'బాహుబలి-2' రికార్డులు కూడా బ్రేక్ కావడం ఖాయమే.