English | Telugu

పుష్ప 2 లో శ్రీలీల ఐటెం సాంగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2(pushpa 2)డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.రీసెంట్ గా ఈ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఒక సమావేశం ఏర్పాటు చేసి పుష్ప   సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా  అంచనాలు  రెట్టింపు అయ్యాయి.

ఇప్పుడు పుష్ప 2 లో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల(sreeleela)కూడా భాగమయినట్టుగా తెలుస్తుంది. ఎప్పటినుంచో పుష్ప 2  ఐటెం సాంగ్ లో ఏ హీరోయిన్ చేస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో  శ్రీలీల చెయ్యబోతుందని, ఈ మేరకు మేకర్స్ శ్రీలీలని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.త్వరలోనే ఇందుకు సంబంధించి అధికార ప్రకటన కూడా రానుందనే వార్తలు వస్తున్నాయి.

 శ్రీలీల  తన ఫస్ట్ సినిమా పెళ్లి సందడి నుంచి గుంటూరు కారం(guntur kaaram)వరకు డాన్స్ ల్లో తనకి తానే సాటి అనే పేరు తెచ్చుకుంది. ఇక అల్లు అర్జున్ సంగతి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. మరి ఈ ఇద్దరు పుష్ప 2 లో చిందులేయ్యడం ఖాయమైతే థియేటర్స్ విజిల్స్ తో మోతమోగిపోవడం ఖాయం. ఆల్రెడీ శ్రీలీల,అల్లు అర్జున్ కలిసి ఇప్పటికే ఒక యాడ్ లో కలిసి చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రష్మిక  కధానాయికగా చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)భారీ వ్యయంతో నిర్మిస్తుంది.