English | Telugu
త్రివిక్రమ్ దర్శకత్వంలో నారా రోహిత్!
Updated : Jan 20, 2026
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో నారా రోహిత్(Nara Rohith) నటిస్తున్నాడా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. విభిన్న చిత్రాలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న 'ఆదర్శ కుటుంబం' ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (Aadarsha Kutumbam House No 47)
'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రోహిత్ కనిపించనున్నాడని న్యూస్ చక్కర్లు కొడుతోంది.
త్రివిక్రమ్ సినిమాల్లో వేరే హీరోలు కీలక పాత్రలలో నటించడం అనేది కొత్త కాదు. 'అల వైకుంఠంపురములో' సినిమాలో హీరో సుశాంత్ కథకి కీలకమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం'లో కూడా కథకి కీలకమైన పాత్రలో రోహిత్ కనిపించనున్నాడట. పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ముఖ్యంగా వెంకటేష్-రోహిత్ మధ్య సన్నివేశాలు అదిరిపోతాయని చెబుతున్నారు.