English | Telugu

దేవరకొండ కోసం దేవర.. ఇక పూనకాలే..!

 

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'VD12' (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఈ మూవీ టైటిల్ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

'VD12' చిత్రానికి 'కింగ్ డమ్' లేదా 'ఎంపీరియమ్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 12న టైటిల్ రివీల్ కానుంది. ఆరోజు టైటిల్ టీజర్ విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ టైటిల్ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించినట్లు వినికిడి. (Jr NTR)

 

స్టార్ హీరో వాయిస్ ఓవర్ తో 'VD12' టైటిల్ టీజర్ ఉంటుందని మొదటి నుంచి వినిపించిన మాట. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ లో ఎవరో ఒకరు వాయిస్ ఓవర్ అందించే అవకాశముందని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ పేరు బాగా వినిపించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. 

 

నిర్మాత నాగవంశీతో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే నాగవంశీ రిక్వెస్ట్ తో 'VD12' టైటిల్ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తారక్ అంగీకరించినట్లు సమాచారం. ఎన్టీఆర్ వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వాయిస్ తో టీజర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు.