English | Telugu

మెగాస్టార్ 'విశ్వంభర'లో మరో మెగా హీరో!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విశ్వంభర' (Vishwambhara). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో మెగా హీరో కీలక పాత్రలో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనకబడిపోయాడు. ఈ క్రమంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్ళీ ట్రాక్ లో పడతాడేమో చూడాలి.

కాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా వైష్ణవ్ తేజ్ 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్', 'అందరివాడు' వంటి సినిమాల్లో తన మేనమామ చిరంజీవితో స్క్రీన్ చేసుకున్నాడు. హీరో అయ్యాక మాత్రం ఇదే మొదటి సినిమా అవుతుంది.