Read more!

English | Telugu

వెట‌ర‌న్ స్టార్ ఇంటికి వ‌చ్చి స‌ర్‌ప్రైజ్ చేసిన‌ అల‌నాటి అందాల‌ హీరోయిన్‌!

 

వెట‌ర‌న్ బాలీవుడ్ యాక్ట‌ర్ శ‌త్రుఘ‌న్ సిన్హా ఇంటికి ఇటీవ‌ల ఒక అనుకోని అతిథి వ‌చ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆ అతిథి ఎవ‌రో కాదు.. ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసిన ముంతాజ్‌. ముంబైలోని త‌న‌ ఇల్లు 'రామాయ‌ణ‌'కు ముంతాజ్ వ‌చ్చిన‌ప్ప‌టి ఫొటోల‌ను శ‌త్రుఘ‌న్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఒక ఫొటోలో ఆయ‌న భార్య పూన‌మ్ సిన్హా కూడా ఉన్నారు. "మా ఫ్రెండ్‌, నా ప‌ర్స‌న‌ల్ ఫేవ‌రేట్, మోస్ట్ బ్యూటిఫుల్‌, టాలెంటెడ్‌, ఎలిగెంట్ యాక్ట‌ర్ ముంతాజ్ కొద్ది రోజుల క్రిత‌మే మా ఇల్లు 'రామాయ‌ణ‌'కు విచ్చేసింది. ఫ్రెండ్స్‌గా, ఆర్టిస్ట్స్‌గా అల‌నాటి చ‌క్క‌టి రోజుల్ని గుర్తుచేసుకోవ‌డం నిజంగా నోస్టాల్జిక్ ఫీలింగ్ క‌లిగించింది." అని శ‌త్రుఘ‌న్‌ రాసుకొచ్చారు.

ఆమెకు త‌న బ‌యోగ్ర‌ఫీ 'ఎనీథింగ్ బ‌ట్ ఖామోష్' బుక్‌ను కానుక‌గా ఇచ్చారాయ‌న‌. "అంద‌రి ప్ర‌శంస‌లూ పొంది, ఎక్కువ‌మంది నోళ్ల‌లో నానిన నా బ‌యోగ్ర‌ఫీ 'ఎనీథింగ్ బ‌ట్ ఖామోష్‌'ను ఆమెకు ప్రెజెంట్ చేయ‌డం వండ‌ర్‌ఫుల్‌. నా కెరీర్‌లో ఆమె కంట్రిబ్యూష‌న్ గురించి కూడా ఆ బుక్‌లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాను. అది గొప్ప మ‌ధ్యాహ్న స‌మ‌యం, చ‌క్క‌గా గ‌డిచింది! ల‌వ్ యు ముంతాజ్‌! మన స్నేహం చిర‌కాలం కొన‌సాగాలి" అని మ‌రో ఫొటోతో బాటు ఆయ‌న రాశారు.

శ‌త్రుఘ‌న్‌, ముంతాజ్ క‌లిసి ఖిలోనా (1970), ఏక్ నారి ఏక్ బ్ర‌హ్మ‌చారి (1971), ఝీల్ కే ఉస్ పార్ (1973), ఆంధియా (1990) సినిమాల్లో క‌లిసి న‌టించారు. 'ఖిలోనా' చేసే నాటికి శ‌త్రుఘ‌న్ కొత్త‌గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ముంతాజ్ అప్ప‌టికే పాపుల‌ర్ స్టార్‌. ఆ సినిమాలో సంజీవ్ కుమార్‌, జితేంద్ర హీరోలు. శ‌త్రుఘ‌న్ బిహారీగా చిన్న పాత్ర చేశారు. శ‌త్రుఘ‌న్‌ను తీసేసి, మ‌రో న‌టుడ్ని తీసుకోవాల‌ని నిర్మాత ఎల్‌.వి. ప్ర‌సాద్‌ అనుకున్న‌ప్పుడు, శ‌త్రుఘ‌న్‌కు అండ‌గా నిలిచారు ముంతాజ్‌. అత‌డిని తీసేస్తే తాను కూడా సినిమా నుంచి త‌ప్పుకుంటాన‌ని ఆమె హెచ్చ‌రించ‌డంతో శ‌త్రుఘ‌న్‌ను ఆ సినిమాలో కొన‌సాగించారు. ఈ విష‌యాల‌ను త‌న బ‌యోగ్ర‌ఫీలో వెల్ల‌డించారు శ‌త్రుఘ‌న్‌.