Read more!

English | Telugu

షాహిద్ క‌పూర్ పేరుతో విసిగిపోయిన‌ విద్యా బాల‌న్‌!

 

గాసిప్స్ అనేవి మ‌న దృష్టిని ఆక‌ర్షిస్తాయి. అయితే అది నిజ‌మా, కాదా తెలుసుకోవాలని త‌హ‌త‌హ‌లాడుతుంటాం. సినిమా వాళ్ల‌పైన వ‌చ్చే వదంతుల‌కైతే అంతు ఉండ‌దు. వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితంలోని ప్ర‌తి విష‌యం తెలుసుకోవాల‌ని అభిమానులు ఆరాట‌ప‌డుతుంటారు. విద్యా బాల‌న్ విష‌యంలో అలాంటి గాసిప్స్ చాలానే ఉన్నాయి. అద్భుత‌మైన న‌టిగా ఇప్ప‌టికే పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకుని, ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని సైతం అందుకున్న ఆమె ఇటీవ‌లే 'షేర్ని' సినిమాలో ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌గా మ‌న‌ముందుకు వ‌చ్చి అల‌రించారు.

2012లో ఆమె సిద్ధార్థ్‌రాయ్ క‌పూర్‌ను సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పెళ్లాడారు. ఆ పెళ్లికి ముందు కొంత కాలం అప్ప‌ట్లో ప్లేబాయ్‌గా పేరుపొందిన షాహిద్ క‌పూర్‌తో ఆమె పేరు క‌లిసి వినిపించింది. 'కాఫీ విత్ క‌ర‌ణ్ షో'లో షాహిద్‌తో త‌న‌కు అనుబంధం ఉండేద‌నే విష‌యాన్ని విద్య చెప్ప‌క‌నే చెప్పారు. ఆ ఇద్ద‌రూ తొలిసారిగా 'కిస్మ‌త్ క‌నెక్ష‌న్' సినిమా సెట్స్‌పై క‌లుసుకున్నారు. ఆ మూవీ విడుద‌లైన కొద్ది కాలానికే వాళ్ల మ‌ధ్య ఎఫైర్ న‌డుస్తోంద‌నే గుస‌గుసలు బాలీవుడ్‌లో గ‌ట్టిగా వినిపించాయి. అయితే ఇద్ద‌రిలో ఎవ‌రూ దాన్ని ధ్రువీక‌రించ‌లేదు. అంత‌లోనే ఇద్ద‌రూ బ్రేక‌ప్ అయ్యార‌నేది ప్ర‌చారంలోకి వ‌చ్చింది. విద్య బ‌రువు గురించి షాహిద్ చేసిన కామెంట్లే దీనికి కార‌ణ‌మ‌ని చెప్పుకున్నారు.

వాళ్ల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ ముగియ‌డానికి కార‌ణ‌మేంట‌నేది మ‌న‌కైతే తెలీదు. కానీ 'నో ఒన్ కిల్డ్ జెస్సికా' (2011) మూవీ రిలీజ్ టైమ్‌లో రాణీ ముఖర్జీతో క‌లిసి క‌ర‌ణ్ జోహార్ చాట్ షో 'కాఫీ విత్ క‌ర‌ణ్‌'లో పాల్గొన్న విద్యా బాల‌న్ ఆ వ్య‌వ‌హారంపై మాట్లాడారు. షాహిద్‌తో రిలేష‌న్‌షిప్ గురించి క‌ర‌ణ్ ఆమెను ప్ర‌శ్నించిన‌ప్పుడు, "మీకు తెలుసా, మా మ‌ధ్య లింక‌ప్ ప్ర‌చారం వ‌చ్చి ఇప్ప‌టికి రెండేళ్ల‌య్యింది. షాహిద్ క‌పూర్ అనే పేరుతో నేను విసిగెత్తిపోయాను. ఐ వాంట్ టు బి లింక్డ్ విత్ అద‌ర్ మెన్‌. అక్క‌డ పొగ లేద‌నీ, మంట లేద‌నీ నేను అన‌డం లేదు. ఆ మంట‌ను ఎవ‌రు ప్రేరేపించారో నేను మీకు చెప్ప‌డం లేదు" అని బోల్డ్‌గా మాట్లాడారు విద్య‌.

ఆ త‌ర్వాత ఏడాది తిర‌క్కుండానే ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ సిద్ధార్థ్ రాయ్ క‌పూర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ తొమ్మిదేళ్లుగా వాళ్ల మ‌ధ్య బంధం రోజురోజుకూ బ‌ల‌ప‌డుతూ వ‌స్తోంద‌ని బాలీవుడ్‌లో చెప్పుకుంటూ ఉంటారు.