English | Telugu

ఆ అమ్మాయి వయసు 16, సల్మాన్‌ఖాన్‌ వయసు 59.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా?

ఆ అమ్మాయి వయసు 16, సల్మాన్‌ఖాన్‌ వయసు 59.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా?

మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి, కొన్ని షాక్‌ ఇస్తాయి. అలాంటి ఓ షాకింగ్‌ న్యూస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరు అది ఫేక్‌ న్యూస్‌ అని కొట్టి పారేస్తున్నా, మరికొందరు వీడియోల మీద వీడియోలు చేసి వదులుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. 16 ఏళ్ళ అమ్మాయితో సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి. ఇదే న్యూస్‌. ఆమధ్య మహా కుంభమేళ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే మోనాలిసా ఒక్క వీడియోతో ఫేమస్‌ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమెపై రకరకాల కథనాలు మీడియాలో వచ్చేశాయి. ఇవన్నీ చూసిన బాలీవుడ్‌ డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రా తను రూపొందించబోయే ‘ది డైరీ ఆప్‌ మణిపూర్‌’ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం మోనాలిసాను ఎంపిక చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక వార్త దేశమంతా పాకిపోయింది. అదేమిటంటే.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి చేసుకున్నాడని, అది కూడా ఎవరినో కాదని, 16 ఏళ్ళ మోనాలిసా అని ప్రచారం మొదలైంది. అంతేకాదు, వారిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోను వైరల్‌ చేసేస్తున్నారు. ఈ న్యూస్‌, ఫోటో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఫోటోలో ఉన్న సల్మాన్‌ఖాన్‌ ఫేస్‌కి, ప్రస్తుతం అతని ఫేస్‌కి చాలా డిఫరెన్స్‌ కనిపిస్తోంది. ఇది డెఫినెట్‌గా ఎఐ ద్వారా క్రియేట్‌ చేసిన ఇమేజ్‌ అని గుర్తించారు. అంతేకాదు, మోనాలిసాకు ఇది వరకు పెళ్ళి జరిగిందా అనే వివరాలు కూడా సేకరించారు. ఆ అమ్మాయి వయసు 16 మాత్రమే కావడంతో పెళ్ళి జరిగే అవకాశం లేదని తేల్చారు. ఫైనల్‌గా ఈ వార్త, ఫోటో ఫేక్‌ అని తెలిసింది. ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రంలోని ఓ పెళ్లి సన్నివేశానికి సంబంధించిన ఫోటోను తీసుకొని అందులో మోనాలిసా ఫోటోను చేర్చారు. దాదాపు 60 సంవత్సరాల వయసు ఉన్న సల్మాన్‌తో 16 ఏళ్ళ మోనాలిసాను చేర్చి, వారికి పెళ్లి జరిగిందనే వార్తను స్ప్రెడ్‌ చేస్తున్న వారిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఎఐ టెక్నాలజీని ఎంతటి దారుణానికైనా వాడుకుంటున్నారంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.