English | Telugu

కొత్త ప్రియుడితో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ లవర్‌!

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఉదంతం 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ రియా చక్రవర్తితో సుశాంత్‌ డేటింగ్‌లో ఉన్నారు. దాంతో ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సుశాంత్‌ తండ్రి పోలీసులకు సూచించారు. ఆ విధంగా ఆమెపై కేసు నమోదైంది. దీనికితోడు ఆమెకు డ్రగ్స్‌ కేసుతో కూడా లింక్‌ ఉందన్న ఆరోపణ రావడంతో కొన్నాళ్ళు రియా జైలు జీవితం కూడా గడిపింది. ఆ తర్వాత ఆమెకు బెయిల్‌ లభించింది. ఈ తరహా కేసులు ఆమెను చుట్టు ముట్టడంతో సినిమాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో మాత్రం కనిపిస్తోంది. ఆమె నటించిన చివరి చిత్రం చెప్‌ారే. ఈ సినిమా 2021లో విడుదలైంది. రియా తెలుగులో తూనీగ తూనీగ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మళ్లీ రియా వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్‌ కామత్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న పుకారు షికారు చేస్తోంది. ఇలాంటివి రియాకి కొత్తేమీ కాదు. ఆమధ్య విరాట్‌ కోహ్లి మేనేజర్‌ బంటి సాజిద్‌తో డేటింగ్‌ చేస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే అవి నిజం కాదని ఆ తర్వాత తేలింది. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న ఈ రూమర్‌లో నిజం ఉందా అంటే.. ఉందనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే గత ఏడాది రియా, నిఖిల్‌ ఇద్దరూ ముంబాయిలో, గోవాలో కలిసి కనిపించారు. అలాగే సోషల్‌ మీడియాలో వీరిద్దరూ చేస్తున్న పోస్టులు చూస్తుంటే వీరి మధ్య రిలేషన్‌ నడుస్తోందనే వార్త బలపడుతోంది. అంతేకాదు, బైక్‌పై రియా, నిఖిల్‌ కలిసి ముంబై రోడ్లపై కనిపించారు. అలాగే గోవా బీచ్‌లో కూడా వీరిద్దరూ సందడి చేసినట్టు తెలుస్తోంది. జెరోదా సంస్థ వ్యవస్థాపకుడైన నిఖిల్‌ కామత్‌ వ్యాపార పరంగా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాంటి బిగ్‌షాట్‌తో ప్రేమాయణం నడుపుతున్న రియా వల్ల అతని జీవితంలో ఎలాంటి అలజడులు రేగుతాయో చూడాలి.