English | Telugu

షారుఖ్ 'ప‌ఠాన్‌'లో స‌ల్మాన్‌.. క‌న్ఫామ్ చేసిన 'టైగ‌ర్‌'!

షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ప‌ఠాన్‌'లో స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వ‌నున్నాడంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం న‌డుస్తోంది. ఆ ప్ర‌చారం వ‌దంతి కాద‌నీ, అది నిజ‌మేననీ క‌న్‌ఫామ్ చేశాడు స‌ల్మాన్ ఖాన్‌. అవును. షారుఖ్ క‌మ్‌బ్యాక్ ఫిల్మ్‌గా చెప్పుకుంటున్న 'ప‌ఠాన్‌'లో నిజంగానే స‌ల్మాన్ అతిథి పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు.

బిగ్ బాస్ 14 షోలో నేటి 'వీకెండ్ కా వీర్' ఎపిసోడ్‌లో స‌ల్మాన్‌, "లైఫ్ కొన‌సాగుతుంటుంది, అలాగే ఈ షో కొన‌సాగుతుంది. ఈ షో ముగిశాక‌, నేను 'ప‌ఠాన్‌', 'టైగ‌ర్ 3', ఈద్‌, దివాలీకి మూవ్ అవుతాను. ఇంకో ఎనిమిది నెల‌ల అనంత‌రం బిగ్ బాస్ సీజ‌న్ 15 మొద‌ల‌వుతుంది." అని చెప్పాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న 'ప‌ఠాన్‌' మూవీలో టైగ‌ర్ రోల్‌లో స‌ల్మాన్ కొద్దిసేపు క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

బాలీవుడ్ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం 'ప‌ఠాన్' షూటింగ్ దుబాయ్‌లోని ఆకాశ హ‌ర్మ్యం బుర్జ్ ఖ‌లీఫాలో జ‌ర‌గ‌నున్న‌ది. హాలీవుడ్ ఫిలిమ్స్ 'మిష‌న్ ఇంపాజిబుల్‌', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్' సిరీస్ లాంటి అతి కొద్ది సినిమాలు మాత్ర‌మే అక్క‌డ షూటింగ్ జ‌రుపుకున్నాయి. బుర్జ్ ఖ‌లీఫా లోప‌ల షూటింగ్ జ‌రుపుకోనున్న తొలి ఇండియ‌న్ ఫిల్మ్‌గా 'ప‌ఠాన్' నిల‌వ‌నున్న‌ది. అక్క‌డ ఒక భారీ స్థాయి యాక్ష‌న్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నారు.

షారుఖ్ స‌ర‌స‌న నాయిక‌గా దీపికా ప‌డుకోనే న‌టిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హాం ఓ కీల‌క పాత్ర‌ధారి. దీపావ‌ళికి ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తోంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.