English | Telugu
ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న అలియా బీచ్ పిక్స్!
Updated : Feb 13, 2021
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇటీవల మాల్దీవులకు వెళ్లి అక్కడ్నుంచి షేర్ చేసిన పిక్చర్స్ ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. ఆమె ముంబైకి తిరిగొచ్చి రెండు రోజులైనా ఆ ఫొటోలను ఫ్యాన్స్ ఇప్పటికీ షేర్ చేస్తూ ఆన్‌లైన్‌ను మోత మోగిస్తున్నారు. అలియా కొద్ది రోజుల క్రితం తన గ్యాంగ్‌తో కలిసి సెలవుల్ని ఎంజాయ్ చేడానికి మాల్దీవులకు వెళ్లింది. ఆమెతో పాటు వెళ్లిన అనుష్క రంజన్ కపూర్ షేర్ చేసిన ఫొటోలు కూడా ఇదే మాదిరి వైరల్ అవుతున్నాయి.
ఈ పిక్చర్స్‌లో అలియా తన చెల్లెలు షహీన్ భట్, బెస్ట్ ఫ్రెండ్ అనుష్క రంజన్ కపూర్, ఆకాంక్ష రంజన్‌లతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది.
సముద్రపు నీళ్లలోంచి తీసుకున్న సెల్ఫీలో పింక్ కలర్ బికినీలో అలియా తెగ చిల్ అవుతూ కనిపిస్తోంది.
అలాగే బీచ్ ఒడ్డున మల్టీ కలర్ బికినీలో కూర్చొని ఉన్న పిక్చర్స్‌ను కూడా ఆమె షేర్ చేసింది.
నిజానికి ఇంకొన్ని రోజులు అక్కడే సరదాగా గడపాలని ఆ గ్యాంగ్ ప్లాన్ చేసుకుంది. కానీ హఠాత్తుగా రణబీర్ కపూర్ చిన్నాన్న రాజీవ్ కపూర్ మృతి చెందడంతో, హడావిడిగా ముంబైకి వచ్చి, ఆయన అంత్యక్రియల్లో పాల్గొంది అలియా.