English | Telugu

స‌ల్మాన్‌తో సాంగ్‌లో నా ప్యాంటీస్ క‌నిపించాల‌న్నారు!

సినీ రంగంలో ప్రియాంకా చోప్రా జ‌ర్నీ ఎవ‌రికైనా స్ఫూర్తిదాయ‌కం. సినిమాల‌తో ఎలాంటి సంబంధం లేని బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన ఆమె, అంచ‌నాల‌కు మించి రాణించి, సుమారు రెండు ద‌శాబ్దాల కెరీర్‌లో టాప్ బాలీవుడ్ తార‌గా ఎదిగారు. ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె త‌న సినీ జ్ఞాప‌కాల‌తో 'అన్‌ఫినిష్డ్' అనే బుక్‌ను రిలీజ్ చేశారు. అత్యంత వేగంగా ఇటు ఇండియా, అటు అమెరికాలో బెస్ట్ సెల్ల‌ర్‌గా అది పేరు తెచ్చుకుంది. ఆ బుక్‌లో త‌న అనుభ‌వాలెన్నింటినో ఆమె పంచుకున్నారు. వాటిలో కొన్ని షాకింగ్ అనిపించేలా ఉన్నాయి.

ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో ఎదురైన ఓ అనుభ‌వాన్ని ఆమె వివ‌రించారు. ఆమె ఓ పెద్ద సినిమాకు సంత‌కం చేశారు. అందులో ఓ సాంగ్‌లో త‌న స్కిన్ చూపించ‌డం కోసం బ‌ట్ట‌ల్ని తీసేయ‌మ‌ని డైరెక్ట‌ర్ అడిగిన మ‌రుస‌టి రోజే ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె త‌ప్పుకున్నారు. "నా స్టైలిస్ట్‌తో మాట్లాడాల‌ని ఆ డైరెక్ట‌ర్ అడ‌గ‌డంతో, నేను అత‌నికి ఫోన్ చేసి, విష‌యం చెప్పి, ఆ డైరెక్ట‌ర్‌కు ఫోన్ అందించాను. నా ముందే నిల్చొని ఆ డైరెక్ట‌ర్‌, 'ఏదేమైనా కానీ, ప్యాంటీస్ క‌నిపించాలి. లేక‌పోతే ఈ సినిమా చూడ్డానికి జ‌నం ఎందుకు వ‌స్తారు?' అని నా స్టైలిస్ట్‌తో చెప్పాడు." అని ఆమె ఆ ఘ‌ట‌న గురించి తెలిపారు.

అయితే ఆ సినిమా హీరో స‌ల్మాన్ ఖాన్‌, త‌న ప‌రిస్థితి గ‌మ‌నించి, జోక్యం చేసుకొన్నార‌ని ప్రియాంక చెప్పారు. ఆ ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నుంచి ఆయ‌నే త‌న‌ను కాపాడార‌ని ఆమె 'అన్‌ఫినిష్డ్‌'లో రాసుకొచ్చారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.