English | Telugu
సగమైనా నా పిల్లలకి ఇవ్వండి..షారుక్ ఖాన్ అభిమానులకి రిక్వెస్ట్
Updated : Feb 4, 2025
సుదీర్ఘ కాలం నుంచి తన అద్భుతమైన నటనతో భారతీయ సినీప్రేమికులని అలరిస్తు వస్తున్న హీరో షారుక్ ఖాన్(Shah rukh Khan)ఈ బాలీవుడ్ బాద్షా కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ లు ఉండటంతో పాటు అభిమాన ఘనం కూడా చాలా ఎక్కువే.గత సంవత్సరం 'డంకీ'(Dunki)తో వచ్చి విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు ఆయన కుమారుడు 'ఆర్యన్ ఖాన్'(Aryan Khan),కుమార్తె 'సహానా'(Sahana)'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' అనే వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ కి పరిచయమవుతున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'(Bads Off Bollywood)కి ఆర్యన్ దర్శకత్వం వహించగా,సహానా ప్రధాన పాత్ర పోషించింది.రీసెంట్ గా ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం జరిగింది.అందులో పాల్గొన్న షారుక్ తన అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతు'నా అభిమానులకి ఒకటే విజ్ఞప్తి.నన్ను ఆదరించినట్టే దర్శకుడిగా పరిచయమవుతున్న నా కొడుకు,నటిగా మీ ముందుకు వస్తున్న నా కూతుర్ని ఆదరించాలి.నాపై చూపించిన అభిమానంతో యాభై శాతం అయినా వాళ్ళ మీద చూపించండి.ఈ సిరీస్ లో అందరు కూడా చాలా చక్కగా నటించారు.కొన్ని ఎపిసోడ్స్ చూసాను.చాలా ఫన్నీగా ఉన్నాయి,తప్పకుండా ఈ సిరిస్ మీ అందర్నీ అలరిస్తుంది.నా వారసత్వాన్ని ఆర్యన్ ముందుకు తీసుకెళ్తాడని చెప్పుకొచ్చాడు.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక యువకుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం,ఆ తర్వాత అతను ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నాడనే పాయింట్ తో'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' చిత్రీకరణ జరుపుకుంది.ఈ సిరీస్ కి సంబంధించిన షారుక్, ఆర్యన్ ల ప్రోమో వీడియో కూడా ఇప్ప్పుడు ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుంది.స్ట్రీమింగ్ డేట్ పై త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.