English | Telugu

క్యాన్సర్ తో తీషా మృతి.. ఆమె తండ్రి ప్రముఖ హీరో 

తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. కేవలం ఇరవై ఏళ్ళ వయసులో ప్రముఖ హీరో కుమార్తె తనువు చాలించింది. వాటి వివరాలు చూద్దాం.

క్రిషన్ కుమార్(krishan kumar)1995 ని హిందీ చిత్ర సీమని ఒక ఊపు ఊపిన బెవఫా సనమ్(bewafa sanam)ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అందులోని పాటలు నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి. క్రిషన్ కూతురు పేరు తీషా(tishaa)గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతుంది. అందుకు సంబంధించిన ట్రీట్ మెంట్ జర్మనీ లో తీసుకుంటూ ఉంది. కానీ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది. మరో రెండు నెలల్లో తన ఇరవై ఒకటవ పుట్టిన రోజు జరుపుకుంటుంది అనగా ఈ సంఘటన జరిగింది. పలువురు భారతీయ సినీ ప్రముఖులు తీషా మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. క్రిషన్ కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

ఈ సంఘటనపై క్రిషన్ కుమార్ సోదరుడి కంపెనీ అయిన టి సిరీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇది మా కుటుంబానికి చాలా క్లిష్టమైన సమయం. కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరకి మా వినయ పూర్వక అభ్యర్ధన అంటూ పేర్కొంది. టి సిరీస్ కి భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కొన్ని వేళ పాటలు టి సిరీస్ ఆడియో ద్వారానే విడుదల అయ్యాయి. అదే విధంగా కొన్ని సినిమాలని సైతం నిర్మించింది. టి సిరిస్ అధినేత గుల్షన్ కుమార్. 1997 లో మాఫియా చేతిలో హత్యకి గురయ్యాడు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.