English | Telugu
Ghooskhor Pandat: ఘూస్‌ఖోర్ పండత్ vs బ్రాహ్మణులు.. మైండ్ బ్లోయింగ్ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్ట్
Updated : Feb 12, 2026
-ఘూస్‌ఖోర్ పండత్ పై బ్రాహ్మణుల నిరసన ఆగుతుందా!
-సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది
-ఎవరి పక్షం
-వాట్ నెక్స్ట్
వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్ పేయి(Manoj bajpayee)అప్ కమింగ్ మూవీ 'ఘూస్‌ఖోర్ పండత్'(Ghooskhor Pandat)పై దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలు తమ నిరసనని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పండత్ లేదా పండిత్ అనే వర్డ్ బ్రాహ్మణ కమ్యూనిటీకి గుర్తింపు. ఘూస్‌ఖోర్ అంటే లంచగొండి. మూవీలో మనోజ్ బాజ్ పేయి పేరు అజయ్ దీక్షిత్. అంటే ఒక బ్రాహ్మణ పోలీస్ ఆఫీసర్ ని అవినీతి ఆఫీసర్ గా మేకర్స్ చూపిస్తున్నారు. టీజర్ లో కూడా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.దీంతో బ్రాహ్మణ సమాజం మొత్తం ఏక తాటిపైకి వచ్చి టైటిల్, హీరో పేరు మార్చాలని ఉద్యమాలు చెయ్యడంతో పాటు మొదట ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశారు. రీసెంట్ గా ఈ విషయంపై సుప్రీంకోర్టు ఏమని స్పందించిందో చూద్దాం.
సమాజంలో ఒక వర్గాన్ని కించపర్చడానికి అలాంటి టైటిళ్లని ఉపయోగించడం తప్పు. అలాంటి శీర్షిలకతో సమాజంలోని ఒక వర్గాన్ని ఎందుకు కించపరచాలి. ఇది నైతికతకి విరుద్ధం. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది ఎవరినీ కించపరచడానికి అనుమతించదు. టైటిల్ ని మార్చేసి మాకు చెప్పకపోతే సినిమాని విడుదల చేయడానికి అనుమతించం. మూవీలో సమాజంలోని ఏ వర్గాన్ని కించపర్చేలా లేదని తెలుపుతూ అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని మేకర్స్ ని ఆదేశిస్తూ తదుపరి విచారణని ఈనెల 19కి వాయిదా వేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కి కూడా సినిమా రిలీజ్ ఆపాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.
Also read: udit narayan: ఉదిత్ నారాయణ్ నా గర్భాశయాన్ని తీయించాడు.. కేసు నమోదు
ఈ వివాదంపై ఇప్పటికే దర్శకుడు నీరజ్ తోపాటు మనోజ్ బాజ్ పేయి స్పందిస్తు సమాజంలో ఎవరి మనోభావాలని దెబ్బతీయాలనేది తమ ఉద్దేశం కాదని, టైటిల్ వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్లందరి భావాలను గౌరవిస్తామని అజయ్ దీక్షిత్ క్యారక్టర్ ఊహాజనిత క్యారక్టర్ మాత్రమేనని, ఎవరిని ఉద్దేశించింది కాదని తెలిపారు. ఘూస్‌ఖోర్ పండత్ కి సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్లు, వీడియోలు,టీజర్ యూట్యూబ్ నుంచి ఇప్పటికే తొలగించడం జరిగింది.