English | Telugu
మహాత్మా గాంధీ తర్వాత ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న షారూక్ ఖాన్!
Updated : Jul 26, 2024
మహాత్మాగాంధీ తర్వాత ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడుగా షారూక్ ఖాన్ రికార్డు సృష్టించాడు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియంలో గతంలో షారూక్ ఖాన్ మైనపు బొమ్మను ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ మ్యూజియం షారూక్‌కి మరో అరుదైన గౌరవాన్ని ఇచ్చి సత్కరించారు. అదేమిటంటే ప్యారిస్‌కి చెందిన గ్రెవిన్ గ్లాస్ విడుదల చేసిన బంగారు నాణెంపై షారూక్ రూపంతోపాటు పేరును ముద్రించారు. ఈ నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్‌లో దేశంలోని ప్రముఖుల మైనపు ప్రతిమలు ఉంచిన విషయం తెలిసిందే. ప్యారిస్‌లో గ్రావిన్ మ్యూజియం కూడా చాలా మంది ప్రముఖుల ప్రతిమలను ఆవిష్కరించింది. ఇప్పుడు షారూక్ గౌరవార్థం బంగారు నాణాన్ని కూడా విడుదల చేయడం విశేషం. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడుగా ఆ ఘనతను సాధించారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయుడు మహాత్మా గాంధీ. మూడు దశాబ్దాలకుపైగా సినీ రంగానికి చేస్తున్న సేవలకు చిహ్నంగా ఈ గౌరవాన్ని అందించింది గ్రావిన్ మ్యూజియం.