English | Telugu
సరిపడా డబ్బులు లేకపోవడం వల్లనే సినిమాని ఆపాం
Updated : Feb 4, 2025
బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'క్రిష్'(Krish)సిరీస్ లు ఎంతగా ఘన విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. క్రిష్ పార్ట్ 1 2003 లో ప్రేక్షకుల ముందుకు రాగా 2006 లో పార్ట్ 2 ,2013 లో పార్ట్ 3 థియేటర్స్ లోకి అడుగుపెట్టి ప్రేక్షకులని ఉర్రుతలూగించాయి.దీంతో 'క్రిష్ 4 'కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు.క్రిష్' ఈ సిరీస్ కి హృతిక్ రోషన్ తండ్రి,రాకేష్ రోషన్(Rakesh Roshan)దర్శకత్వాన్ని వహించాడు.
రాకేష్ రోషన్ ప్రస్తుతం 'ది రోషన్స్'(The Roshans)అనే ఒక డాక్యుమెంటరీ ని రూపొందిస్తున్నాడు.హృతిక్ రోషన్ కుటుంబాన్ని బేసిక్ గా చేసుకొని ఈ డాక్యుమెంటరీ చిత్రీకరించగా,వాటికి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతు క్రిష్ 4 కోసం 12 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను.కానీ ఆ చిత్రాన్ని తెరకెక్కించే బడ్జెట్ లేకపోవడం వలన తెరకెక్కించలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా డబ్బు సమకూరడం లేదు.ఆ మూడు సిరీస్ లని మించి తెరకెక్కించాలంటే చాలా డబ్బు కావాలి.నేను బడ్జెట్ తగ్గించి తెరకెక్కిస్తే క్రిష్ 4(Krish 4)కి న్యాయం జరగదు.ఒక సాధారణ కథలా అయిపోతుంది.ప్రస్తుతం సెల్ ఫోన్ వలన ప్రపంచం మొత్తం చాలా చిన్నదయ్యింది.
చాలా మంది పిల్లలు ఇతర దేశాలకి చెందిన సూపర్ హీరోల సినిమాలు చూస్తున్నారు.దీంతో నేను క్రిష్ 4 ని మరింత జాగ్రతగా తెరకెక్కించకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఇక ఆయన చేసిన వ్యాఖ్యలతో క్రిష్ 4 తెరకెక్కే అవకాశం లేనట్టే అని ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.