English | Telugu

బిగ్‌ బ్రేకింగ్‌... మళ్లీ కోర్టుకెక్కిన ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌!

బిగ్‌ బ్రేకింగ్‌... మళ్లీ కోర్టుకెక్కిన ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌!

ప్రస్తుతం మీడియాగానీ, సోషల్‌ మీడియాగానీ ఏదో ఒక సెన్సేషన్‌ న్యూస్‌ కోసమే ఎదురుచూస్తోంది. ఏ చిన్న ఆధారం కనిపించినా దాన్ని హైలైట్‌ చేస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. ఇటీవలికాలంలో అలాంటి సంచలన వార్తలు మీడియాలో అనేకం వచ్చాయి. వాటిలో కొన్ని వాస్తవం అయినప్పటికీ ఎక్కువ శాతం ఫేక్‌ న్యూస్‌లే కనిపించడం గమనార్హం. అలాంటి ఓ కేసు విషయంలో బచ్చన్‌ కుటుంబం కోర్టుకెక్కింది. గత కొన్ని నెలలుగా అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అది నిజమేనని చెప్పే కొన్ని సంఘటనలను కూడా ప్రస్తావించారు. అయితే ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది. ఇప్పుడు ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ కోసం మరోసారి కోర్టుకెక్కింది. 

ఆరాధ్య బచ్చన్‌ ఆరోగ్యం బాగా లేదంటూ, విషమంగా ఉందంటూ రకరకాల వార్తలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీనిపై బచ్చన్‌ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌, కొన్ని సోషల్‌ మీడియా ఎకౌంట్ల ద్వారా ఈ దుష్ప్రచారం జరుగుతోందని గుర్తించారు. కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి ‘ఆరాధ్య నో మోర్‌’ అని కూడా వేశారు. దీంతో బచ్చన్‌ కుటుంబం దీన్ని బాగా సీరియస్‌గా తీసుకుంది. అలాంటి వీడియోలను తొలగించాలని 2023లో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కూతురు ఆరోగ్యం విషయంలో కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఐశ్వర్యా రాయ్‌ తన 
పిటిషన్‌లో తెలిపారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు గూగుల్‌కి నోటీసులు జారీ చేసింది. దీన్ని కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ పట్టించుకోలేదు. ఆరాధ్యకు సంబంధించిన వీడియోలను అలాగే ఉంచారు. ఈ పిటిషన్‌ వేసిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు కూడా బచ్చన్‌ ఫ్యామిలీని సపోర్ట్‌ చేస్తూ కథనాలు ప్రచురించాయి. ఒక మైనర్‌ బాలికపై ఇలాంటి ప్రచారాలు చేయడం తగదు అని ఆ మీడియా సంస్థలు చెప్పాయి. 

2023లో బచ్చన్‌ ఫ్యామిలీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వెంటనే అలాంటి వీడియోలను యూ ట్యూబ్‌ నుంచి తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ ఆ వీడియోలను తొలగించాయి. ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నా కొన్ని ఛానల్స్‌లో ఆ వీడియోలు అలాగే ఉన్నాయి. దీంతో మరోసారి బచ్చన్‌ కుటుంబం కోర్టుకు వెళ్ళక తప్పలేదు. ఆరాధ్య తల్లిదండ్రులుగా అభిషేక్‌, ఐశ్వర్య ఢల్లీి హైకోర్టులో కొత్త పిటిషన్‌ దాఖలు చేశారు. కొత్త పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, గూగుల్‌తో సహా కొన్ని వెబ్‌సైట్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత కొన్ని యూటూబ్‌ ఛానల్స్‌ స్పందించి వీడియోలు తీసేసినప్పటికీ కొందరు మాత్రం అసలు కోర్టుకే హాజరు కాలేదని తెలుస్తోంది. దీనిపై మార్చి 17న తదుపరి విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.