English | Telugu

కిస్ పెట్టమని డైరెక్టర్ ని అడిగిన హీరో 

కిస్ పెట్టమని డైరెక్టర్ ని అడిగిన హీరో 

2011 లో విడుదలైన 'ప్యార్ కా పంచనామా' అనే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన నటుడు కార్తీక్ ఆర్యన్(Kartik aaryan)ఆ తర్వాత ఆకాష్ వాణి, కాంచి,సిల్వత్,గెస్ట్ ఇన్ లండన్,లుక ఛుప్పి,భూల్ భూలైయా 2 వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందాడు.రీసెంట్ గా చందు ఛాంపియన్, భూల్ భూలైయా 3 తో స్టార్ స్టేటస్ ని కూడా పొందాడు.

రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సినిమాల్లో ముద్దు సీన్ తలనొప్పిగా మారుతుందని ఎప్పుడు అనుకోలేదు.నేను గతంలో చేసిన 'కాంచి' మూవీలో  హీరోయిన్ మిస్త్రీతో ముద్దు సీన్ ఉంది.ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నా కూడా ఆ విషయంలో దర్శకుడు సంతృప్తి చెందలేదు.చివరకి నాకు విసుగొచ్చి మీరు ముద్దు పెట్టుకొని చూపించండని అన్నాను.ఎట్టకేలకు 37 టేకుల తర్వాత ముద్దు సీన్ ని ఓకే చేసారని చెప్పుకొచ్చాడు.

'కాంచి' మూవీ ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడైన 'సుభాష్ గాయ్' స్వీయ దర్శకత్వంలో తెరకెక్కగా 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మిధున్ చక్రవర్తి, రిషి కపూర్ వంటి టాప్ స్టార్స్ తో పాటు ఆదిల్ హుస్సేన్, ముకేశ్ భట్ కీలక పాత్రల్లో కనిపించారు.

 

కిస్ పెట్టమని డైరెక్టర్ ని అడిగిన హీరో