English | Telugu

రెండో భర్తను జైలుకి పంపి.. మూడో పెళ్లికి రెడీ!

రెండో భర్తను జైలుకి పంపి.. మూడో పెళ్లికి రెడీ!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రేమ వ్యవహారాలకు, రిలేషన్‌షిప్స్‌కి, విడాకులకు, ఒకటికి మించిన పెళ్ళిళ్లకు, లైంగిక వేధింపులకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఈ విషయంలో చాలా అడ్వాన్స్‌గా ఉంది. ఇటీవలికాలంలో సౌత్‌ ఇండస్ట్రీ కూడా ఇలాంటి వాటిలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే బాలీవుడ్‌ని మాత్రం ఏ ఇండస్ట్రీ క్రాస్‌ చేసే పరిస్థితి లేదని తాజాగా జరిగిన ఓ ఘటన ప్రూవ్‌ చేస్తోంది. నచ్చిన హీరోతో రిలేషన్‌లో ఉండడం, ఆ తర్వాత ఫ్రెండ్లీగా విడిపోవడం, మరో స్నేహితుడ్ని వెతుక్కోవడం.. బాలీవుడ్‌లో ఇది సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే కొందరు మాత్రం పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లోనే భర్తను మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 

రాఖీ సావంత్‌ అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే సంగతి అందరికీ తెలిసిందే. 1997లో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రాఖీ చాలా సినిమాల్లో నటించింది. అలాగే ఐటమ్‌ సాంగ్స్‌ కూడా చాలా చేసింది. ఇక వీడియో సాంగ్స్‌కి లెక్కే లేదు. ఇంకా లెక్కకు మించిన టీవీ ప్రోగ్రామ్స్‌లో, టీవీ షోస్‌లో కనిపించింది. 46 ఏళ్ళ రాఖీ ఎప్పుడూ బ్రేక్‌ తీసుకోలేదు. ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటుంది. అయితే ఆమెకు సినిమాలు, టీవీ షోల ద్వారా వచ్చిన పాపులారిటీ కంటే వివాదాల ద్వారా వచ్చిన పేరు ఎక్కువ. ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కావాలనే కొన్నింటిలో ఇన్‌వాల్వ్‌ అవుతుందనే కంప్లయింట్‌ కూడా ఆమెపై ఉంది. అయితే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వివాదంతో వార్తల్లోకి ఎక్కింది. 

సినిమా ఇండస్ట్రీలో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు గొప్ప ఆర్టిస్టులుగా చెప్పబడుతున్న కొందరు హీరోయిన్లు గతంలో రెండు పెళ్లిళ్లకు మించి చేసుకున్నవారు ఉన్నారు. అయితే అది వారి వ్యక్తిగత విషయంగానే పరిగణించారు. కానీ, ఇప్పుడు రాఖీ సావంత్‌ అలా కాకుండా తన పెళ్లిళ్ల విషయంలో రచ్చకెక్కింది. 2019లో రితేష్‌ సింగ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో మూడు సంవత్సరాలు మాత్రమే కాపురం చేసి 2022లో విడాకులు తీసుకుంది. అదే సంవత్సరం ఆదిల్‌ఖాన్‌ దురాని అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. అతనితో మూడు సంవత్సరాలు కాపురం చేసింది. తాజాగా అతనిపై పోలీస్‌ కేసు పెట్టింది. తనను మానసికంగా వేధించాడని, చాలా సార్లు కొట్టాడని తన కంప్లయింట్‌లో పేర్కొంది. రాఖీ ఇచ్చిన ఫిర్యాదుతో ఆదిల్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ జరిపి అతన్ని జైలుకు పంపారు. కోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాఖీ మూడో పెళ్లి సిద్ధమైపోయింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించింది. తన పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేసింది. పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాలో మ్యారేజ్‌ రిసెప్షన్‌ ఉంటుందట. హనీమూన్‌ కోసం స్విట్జర్లాండ్‌గానీ, నెదర్లాండ్‌గానీ వెళ్ళే అవకాశం ఉందని చెబుతోంది. ఇప్పుడు రాఖీ వ్యవహారం వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్‌ చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆరు సంవత్సరాల్లో మూడో పెళ్లికి సిద్ధమైన ఆమెను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు.