English | Telugu
స్విమ్‌సూట్‌లో మతులు పోగొడుతున్న జాన్వీ.. తగ్గేదేలే!
Updated : Apr 9, 2021
జాన్వీ కపూర్ తగ్గేదేలే అంటోంది. మాల్దీవుల్లో నిన్నొక లెక్క, నేడొక లెక్క అన్నట్లు చెలరేగిపోతోంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ఆమె రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మూవీ సెలబ్రిటీలకు ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ అయ్యాయి మాల్దీవులు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ మాల్దీవుల్లో తను ఎలా ఎంజాయ్ చేస్తోందో తెలిపే కొన్ని పిక్చర్స్‌ను నిన్న షేర్ చేసిన విషయం తెలిసిందే. అవొక లెక్క అనుకుంటే, ఇప్పుడు స్విమ్‌సూట్‌లో మాల్దీవులను వేడెక్కించే రీతిలో పిక్చర్స్ షేర్‌చేసి ఔరా అనిపిస్తోంది. ఆ పిక్చర్స్‌లో ఆమె అందచందాలు చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నట్లు ఉంది.
ఓవైపు సూర్యాస్తమయ సౌందర్యం, ఇంకోవైపు స్కైబ్లూ స్టైలిష్ మెటాలిక్ స్విమ్‌సూట్‌లో జాన్వీ సొగసులు.. మతులు పోతున్నాయనుకోండి! జాన్వీ షేర్ చేసిన ఫొటోల్లో నీలి సముద్రం కూడా మెరిసిపోతోంది.
జాన్వీ బ్యూటీని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ ఫొటోలను షేర్ చేసిన జాన్వీ, వాటికి ఇరిడీసెన్స్ అనే క్యాప్షన్ రాసి, దానికి రెయిన్‌బో ఎమోజీని జోడించింది.
ఆమె వాటిని పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సారా అలీఖాన్ వాటిని లైక్ చేయగా, పలువురు హార్ట్ ఎమోటికాన్స్‌ను జోడిస్తూ రిప్లైలు ఇచ్చారు. ఏదేమైనా జాన్వీ లేటెస్ట్ పిక్చర్స్ ఆన్‌లైన్‌ను హీటెక్కించే రీతిలో వైరల్ అవుతున్నాయి.