English | Telugu
సంక్రాంతికి `పొన్నియన్ సెల్వన్`
Updated : Apr 9, 2021
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. `పొన్నియన్ సెల్వన్`. విక్రమ్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష.. ఇలా భారీ తారాగణమే నటిస్తున్న ఈ చారిత్రక చిత్రానికి సంబంధించి.. ఇప్పటివరకు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. మధ్యప్రదేశ్ లో జరగాల్సిన షూటింగ్ కి కరోనా కారణంగా అనుమతులు రాకపోవడంతో.. చెన్నై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మిగిలిన భాగాన్ని పూర్తిచేయనున్నారు. కాగా, అన్నీ కుదిరితే 2022 సంక్రాంతికి `పొన్నియన్ సెల్వన్`ని థియేటర్స్ లోకి తీసుకురావడానికి మణిరత్నం అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రాత్మక తమిళ నవల `పొన్నియన్ సెల్వన్` ఆధారంగా అదే పేరుతో మణిరత్నం `పొన్నియన్ సెల్వన్`ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒకటి నెగటివ్ రోల్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నారు. మరి.. ఈ హిస్టారికల్ డ్రామాతో మణిరత్నం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.