Read more!

English | Telugu

‘ఫైటర్‌’ ఫస్ట్‌లుక్‌.. హృతిక్‌, దీపిక గెటప్స్ సూపర్!

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో హృతిక్‌  రోషన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఫైటర్‌’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెకేషన్స్‌ ఉన్నాయి. వార్‌, విక్రమ్‌ వేద వంటి భారీ యాక్షన్‌ మూవీస్‌ తర్వాత హృతిక్‌ చేస్తున్న ‘ఫైటర్‌’ చిత్రంలో దీపిక పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. ఎంతోకాలంగా అభిమానులు ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. 

‘ఫైటర్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. స్క్వాడ్రన్‌ లీడర్‌ షంషేర్‌ పఠానియా పాత్రలో నటిస్తున్నారు హృతిక్‌.  స్క్వాడ్రన్‌ పైలట్‌ హోదాలో ఎయిర్‌ డ్రాగన్స్‌ యూనిట్‌లోని ఈ కీలకమై పాత్రలో పోషిస్తున్నారు. సంబంధిత యూనిపాంలో హృతిక్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అలాగే దీపికా పదుకొనె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేవారు. స్క్వాడ్రన్‌ లీడర్‌ మినల్‌ రాథోర్‌గా దీపిక అలరించనుంది. దీపికా లుక్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. టైటిల్‌ కు తగ్గుట్టుగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ రోల్స్‌ ను డిజైన్‌ చేశారని పోస్టర్లను చూస్తే అర్థమవుతోంది. పైలట్స్‌గా ఇద్దరు స్టార్స్‌ ఎలాంటి అద్భుతాన్ని చేయబోతున్నారనేది చూడాలి. 

2021 జనవరిలో ఓ ప్రకటన చేసిన చిత్ర యూనిట్‌ సినిమాను 2022 సెప్టెంబర్‌ 30న విడుదల చేస్తామన్నారు. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా పెండిరగ్‌ ఉండడంతో చాలా ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను జనవరి 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్‌కి దగ్గర పడుతుండంతో ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభించారు. అనిల్‌ కపూర్‌, కరణ్‌సింగ్‌, అక్షయ్‌ ఒబేరాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.