Read more!

English | Telugu

24 గంటల్లో 103 మిలియన్స్‌ వ్యూస్‌.. అదీ షారూక్‌ రేంజ్‌!

‘పఠాన్‌’, ‘జవాన్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఈ ఏడాదిలోనే తన ఖాతాలో వేసుకున్న షారూక్‌ ఖాన్‌ ఇప్పుడు మూడో సినిమా ‘డంకీ’తో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వంలో రూపొందిన ‘డంకీ’ డిసెంబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘డంకీ డ్రాప్‌ 4’గా రిలీజైన డంకీ సినిమా ట్రైలర్‌ సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తూ దూసుకెళ్తోంది. మనసులను హత్తుకునే భావోద్వేగాలతో రాజ్‌కుమార్‌ హిరాని సినిమాను చక్కగా రూపొందించారని ట్రైలర్‌లో తెలుస్తుంది. షారూక్‌ ఖాన్‌ సహా తాప్సీ, విక్కీ కౌశల్‌, తాప్సీ పన్ను, విక్రమ్‌ కొచ్చర్‌, అనీల్‌ గ్రోవర్‌, బోమన్‌ ఇరాని నటీనటులు తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారని ట్రైలర్‌లోనే అర్థమవుతోంది. 

షారూక్‌ ఖాన్‌ తిరుగులేని చార్మింగ్‌ లుక్స్‌కి రాజ్‌కుమార్‌ హిరాని భావోద్వేగాలు సిల్వర్‌ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్ని క్రియేట్‌ చేయనున్నాయి. డంకీ డ్రాప్‌ 4 అంటూ మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ఈ ట్రైలర్‌కు అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో కలిపి 24 గంటల్లో  103 మిలియన్స్‌ వ్యూస్‌ రావటమే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ తెలియజేస్తుంది. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌ బ్యానర్స్‌ సమర్పణలో రాజ్‌ కుమార్‌ హిరాణి, గౌరి ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్‌ జోషి, రాజ్‌ కుమార్‌ హిరాణి, కణిక థిల్లాన్‌ ఈ చిత్రానికి రచయితలు.